https://oktelugu.com/

KCR-Stalin: కేసీఆర్, స్టాలిన్.. పాత దోస్తీ పునరుద్ధరణ సాధ్యమేనా?

KCR-Stalin: కేంద్ర ప్రభుత్వంతో పోరాడేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం బీజేపీయేతర పక్షాలను ఏకం చేసే పనిలో పడిపోయారు. దీనికి గాను అన్ని మార్గాలు అన్వేషిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక పక్షాలతో జట్టు కట్టాలని భావిస్తున్నారు దీంతో బీజేపీని నిలువరించాలని తాపత్రయపడుతున్నారు. ఇటీవల కాలంలో ధాన్యం కొనుగోలు అంశాన్ని పార్లమెంట్ వేదికగా చేసుకుని బీజేపీని ఇరుకున పెట్టాలని చూసింది. కానీ ఫలితం రాకపోవడంతో ఇక లాభం లేదనుకుని బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 14, 2021 / 11:43 AM IST
    Follow us on

    KCR-Stalin: కేంద్ర ప్రభుత్వంతో పోరాడేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం బీజేపీయేతర పక్షాలను ఏకం చేసే పనిలో పడిపోయారు. దీనికి గాను అన్ని మార్గాలు అన్వేషిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక పక్షాలతో జట్టు కట్టాలని భావిస్తున్నారు దీంతో బీజేపీని నిలువరించాలని తాపత్రయపడుతున్నారు. ఇటీవల కాలంలో ధాన్యం కొనుగోలు అంశాన్ని పార్లమెంట్ వేదికగా చేసుకుని బీజేపీని ఇరుకున పెట్టాలని చూసింది. కానీ ఫలితం రాకపోవడంతో ఇక లాభం లేదనుకుని బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

    KCR-Stalin

    ఇందుకోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. అవసరమైతే కాంగ్రెస్ కూటమితో కూడా కలిసేందుకు ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో భేటీ అయ్యేందుకు శ్రీరంగం వెళ్లారు. అక్కడ స్టాలిన్ తో జరిగే సమావేశంలో బీజేపీని ఎదుర్కోవాలని కోరనున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి వ్యతిరేకంా విపక్ష కూటమిని తయారు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

    Also Read: కేసీఆర్ ఇక నీ పని అయిపోయింది.. ఎమ్మెల్యే ఈటల సంచలన వ్యాఖ్యలు!

    అయితే గతంలో స్టాలిన్ కొన్ని విషయాల్లో చర్చిద్దామని రమ్మంటే కేసీఆర్ మాత్రం హాజరు కాలేదు. ఇప్పుడు కేసీఆర్ పిలుపుకు ఆయన సానుకూలంగా స్పందిస్తారా అనేది చర్చనీయాంశం. దీంతో రాజకీయాల్లో ఏం మార్పులు వస్తాయో అనే సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ అనుకున్నది సాధిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రస్తుతం కేసీఆర్ ఆహ్వానం మేరకు స్టాలిన్ ఎలా స్పందిస్తారనే దానిపై అందరిలో చర్చ సాగుతోంది.

    అయితే స్టాలిన్ తో చర్చించే అంశాల్లో బీజేపీపై పోరాటమే ప్రధానంగా ఉండనుందని తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టే క్రమంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరును ఆక్షేపించేందుకే ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో కేసీఆర్, స్టాలిన్ మధ్య జరిగే చర్చలపై ఆసక్తి నెలకొంది. దీంతో ఇద్దరు సీఎంల మధ్య చోటుచేసుకునే చర్చలపై అందరు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

    Also Read: బీజేపీనే టార్గెట్ చేస్తున్న కేసీఆర్.. బీజేపీయేతర పక్షాలతో భేటీ

    Tags