Virataparvam: రోమాలు నిక్కపొడుచుకునేలా ‘ది వాయిస్​ ఆఫ్ రవన్న’.. ‘విరాట పర్వం’ తాజా అప్​డేట్​

Virataparvam: రానా దగ్గుబాటి వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం పవర్​స్టార్​ పవన్​కళ్యాణ్​తోకలిసి భీమ్లానాయక్​లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో రానా పవర్​ఫుల్​ పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాటపర్వ సినిమా కూడా చేస్తున్నారు రానా. ఇప్పటికే విడుదలైన టీజర్​, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు రేకెత్తించాయి. ఇందులో హీరోయిన్​గా సాయిపల్లవి నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవగా కరోనా […]

Written By: Raghava Rao Gara, Updated On : December 14, 2021 1:09 pm
Follow us on

Virataparvam: రానా దగ్గుబాటి వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం పవర్​స్టార్​ పవన్​కళ్యాణ్​తోకలిసి భీమ్లానాయక్​లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో రానా పవర్​ఫుల్​ పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాటపర్వ సినిమా కూడా చేస్తున్నారు రానా.

ఇప్పటికే విడుదలైన టీజర్​, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలు రేకెత్తించాయి. ఇందులో హీరోయిన్​గా సాయిపల్లవి నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఇందులో ప్రియమణి కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలంగాణ సాయుధపోరాట నేపథ్యంలో 1990లో జరిగిన వాస్తవ కథ ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సురేశ్ బాబు – సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

కాగా, రానా పుట్టినరోజు సందర్భంగా విరాట పర్వ నుంచి రానా వాయిస్​తో ఓ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ది వాయిస్​ ఆఫ్ రవన్న పేరుతో వచ్చి ఈ వీడియో చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. రానా ఇందులో అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తిగా కనిపించగా.. అతను రాసిన కవితలు చదివి అభిమానిగా మారి అతడి ప్రేమకోసం వెతుకుతూ వెళ్లి చిక్కుల్లో పడ్డ యువతిగా సాయిపల్లవి కనిపిస్తుంది.  ఆ తర్వాత ఏమైందనేదే కథ. ఇందులో నందితా దాస్​, నవదీప్​, నవీన్ చంద్ర, జరీనా వహాబ్​ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. సంక్రాంతికి ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.