కమలానికి కష్టకాలమేనా..?

ప్రజలు ప్రతీసారి ఓటేస్తున్నారు.. గెలిపిస్తున్నారు.. ఇక మనం ఆడిందే ఆట.. పాడిందే పాట అనుకుంటే పొరపాటే. ఓపికతో ఉండే ప్రజలు తమ ఓటు అస్త్రంతో సమయం వచ్చినప్పుడు తిప్పి కొడతారు. ఎన్నేళ్లు వేచిచూశారో.. అంతకు ఎక్కువ అనుభవించేలా చేస్తారు. ప్రస్తుతం భారతీయ జనతాపార్టీది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీకి అనుకూల సంకేతాలు కనిపించడం లేదు. ఏడేళ్లలో ఎన్నడూ లేనంత వ్యతిరేకత ఇప్పుడు వస్తోంది. పెట్రోలు ధరలు పెరగడం, నిత్యవసరాల ధరలు నింగిని అంటడంతో మధ్యతరగతి ప్రజలు […]

Written By: Srinivas, Updated On : February 12, 2021 10:26 am
Follow us on


ప్రజలు ప్రతీసారి ఓటేస్తున్నారు.. గెలిపిస్తున్నారు.. ఇక మనం ఆడిందే ఆట.. పాడిందే పాట అనుకుంటే పొరపాటే. ఓపికతో ఉండే ప్రజలు తమ ఓటు అస్త్రంతో సమయం వచ్చినప్పుడు తిప్పి కొడతారు. ఎన్నేళ్లు వేచిచూశారో.. అంతకు ఎక్కువ అనుభవించేలా చేస్తారు. ప్రస్తుతం భారతీయ జనతాపార్టీది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీకి అనుకూల సంకేతాలు కనిపించడం లేదు. ఏడేళ్లలో ఎన్నడూ లేనంత వ్యతిరేకత ఇప్పుడు వస్తోంది. పెట్రోలు ధరలు పెరగడం, నిత్యవసరాల ధరలు నింగిని అంటడంతో మధ్యతరగతి ప్రజలు బీజేపీ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారు. ఉత్తరాదిన బలమైన పార్టీగా ఉన్న బీజేపీ ఇప్పుడు బలహీన పడక తప్పదనే తెలుస్తోంది. త్వరలో ఎన్నికలు జరగనున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బీజేపీకి పరాభావం తప్పదంటున్నారు రాజకీయ నిపుణులు.

Also Read: భారత జవాన్ల చేతిలో చచ్చిన చైనా జవాన్ల సంఖ్య 45

కొత్త వ్యవసాయ చట్టాల అమలు నేపథ్యంలో రైతు ఉద్యమం ఉత్తరాదిన తీవ్రమైంది. అక్కడ అన్ని రాష్ట్రాల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ప్రధానంగా పంజాబ్ రాష్ట్రంలో రైతులు ఆర్థికంగా బలమైన వారు. వారు ఇప్పుడు బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. దాదాపు రెండు నెలలకు పైగానే రైతు ఉద్యమం కొనసాగిస్తున్నారు. నూతన చట్టాలు రద్దు చేయాలని సరిహద్దుల్లో తిష్టవేసి కూర్చున్నారు. కేంద్రం దిగిరాకపోవడంతో బీజేపీపై గుర్రుగా ఉన్నారు. త్వరలో పంజాబ్ లో ఎన్నికలు జరగనుండడంతో తమ తడాఖా చూపిస్తామంటున్నారు.

ఉత్తర ప్రదేశ్ లోనూ బీజేపీ బలంగా ఉన్నామని భావిస్తోంది. కానీ ఇక్కడ కూడా రైతు ఉద్యమం ఎఫెక్టు ఉంది. రాకేశ్ టికాయత్ ప్రభావం ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో పడుతుందంటున్నారు. ఆయన తండ్రి మహేంద్ర సింగ్ టికాయత్ రైతు నాయకుడిగా మంచి పేరుంది. చక్కెర పండించే రైతులు ఇక్కడ ఎక్కువ. జాట్ వర్గం ప్రజలు అధికంగా ఉంటారు. వీరి ఓట్లు రాష్ట్రంలో చాలా ముఖ్యం.

Also Read: మేయర్ పీఠం.. ఎవరూ నోరెత్తకుండా.. కేసీఆర్ పక్కా ప్లాన్

దీంతో ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో రైతు వర్గం పూర్తిగా వ్యతిరేక ప్రచారం చేసే అవకాశం ఉంది. రాకేశ్ టికాయత్ నేతృత్వం వహిస్తుండడంతో ఈ ప్రభావం ఉత్తర ప్రదేశ్ లో రైతులందరూ సంఘటితం అవుతున్నారు. ఈ సమస్యను సున్నితంగా డీల్ చేయకపోతే.. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో కష్టాలు తప్పవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్