Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan: జగన్ కు వెన్నుపోటు పొడిచిన ఆ వైసీపీ కుట్ర దారుడు ఆయనేనా..?

CM Jagan: జగన్ కు వెన్నుపోటు పొడిచిన ఆ వైసీపీ కుట్ర దారుడు ఆయనేనా..?

CM Jagan
CM Jagan

CM Jagan: రాష్ట్రంలో వైసీపీ సర్కార్ కు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలకు ఒక వ్యక్తి కారణమన్న చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్న కోటరీలో అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా ఈయన పేరు గడించాడు. ఈయన సిగ్నల్ లేనిదే వైసిపి ప్రభుత్వం లో ఏ పని జరగదు అన్న భావన కింది స్థాయి క్యాడర్ నుంచి పై స్థాయి నాయకుల వరకు వెళ్లింది. ఇప్పుడు అదే వ్యక్తి వైసిపి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి కారణమయ్యాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్యేలకు కనీసం గౌరవం ఇవ్వని పరిస్థితి..

సీఎం జగన్మోహన్ రెడ్డి కల్పించిన ప్రాధాన్యతతో గత నాలుగేళ్లుగా సదరు వ్యక్తి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ పార్టీకి అనేక వర్గాలను దూరం చేశాడన్న భావన పార్టీలో వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ, కొందరిని తీవ్రంగా కించపరిచిన సందర్భాలు ఉన్నాయని పలువురు చెప్పుకుంటున్నారు. 2019 లో వైసీపీ విజయం సాధించడంలో కీలకంగా ఉన్న సోషల్ మీడియాను నిద్రాణంగా ఉంచడంలోనూ ఈయన పాత్ర కీలకమని చెబుతున్నారు. ఈయన వ్యవహార శైలితో విసిగిపోయిన అనేక వర్గాలు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి దూరంగా జరిగిపోతున్నాయి. తనకు ఇష్టమైన ఎమ్మెల్యేలతో ఒక రకంగా, నచ్చని వారితో మరోరకంగా వ్యవహరిస్తూ ఎమ్మెల్యేలు అసంతృప్తి రగలడడానికి కారణమయ్యాడన్న విమర్శలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఆయా ఉద్యోగ సంఘాలను ప్రభుత్వానికి దూరం చేశాడని, ప్రస్తుతం ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య దూరం పెరగడానికి ఆయనే కారణం అన్న చర్చ జరుగుతోంది.

సర్వే నివేదికలకు వక్రీకరణ..

సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఆయనకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. సదరు నాయకుడు మాత్రం ఒక సర్కిల్ గీసి.. దాన్ని దాటి ఎవరు రాకుండా చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు పనితీరుపైన, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న అభిప్రాయాలను తెలుసుకునేందుకు చేపట్టే సర్వేలను వక్రీకరిస్తున్నాడు అన్న విమర్శలు ఉన్నాయి.

CM Jagan
CM Jagan

అదుపులో ఉంచుకుంటేనే మేలు..

సదరు వ్యక్తి వలన పార్టీ క్యాడర్, అధికారుల మధ్య దూరం పెరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు, ఆ పార్టీ ముఖ్య నేతలకు సమాచారాన్ని లీక్ చేయడంలో కూడా ఈయన పాత్ర ఉందన్న ప్రచారం జరుగుతుంది. అధికారులను ఇబ్బందులకు గురి చేసే చర్యలు చేపడుతూ ప్రభుత్వంపై వాళ్లు మరింత రగిలిపోయేలా ప్రణాళిక ప్రకారమే చేస్తున్నాడని అధికార పార్టీ నాయకులు, ప్రతినిధులు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిని గుర్తించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సదరు వ్యక్తిని పక్కన పెట్టాలని సూచిస్తున్నారు. లేకపోతే భవిష్యత్తులో జరిగే నష్టం పూడ్చలేనిదిగా మారుతుందని స్పష్టం చేస్తున్నారు.

Exit mobile version