https://oktelugu.com/

ఉపాధ్యాయులను ఎన్నికలకు దూరంపెట్టడం కేసీఆర్ వ్యూహంలో భాగమేనా?

తెలంగాణలో గత కొద్దిరోజులుగా రాజకీయవేడి రాజుకుంటోంది. దుబ్బాకలో ఉప ఎన్నిక ఫలితం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడం టీఆర్ఎస్ కు చెంపపెట్టులా మారింది. దీంతో టీఆర్ఎస్ సర్కార్ అలర్ట్ అయింది. ఈక్రమంలోనే వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈమేరకు టీఆర్ఎస్ శ్రేణులను రంగంలోకి దింపి దిశానిర్దేశం చేస్తున్నారు. Also Read: కేసీఆర్ వ్యూహం దెబ్బకొడుతోందా..? కిందటిసారి జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకంగా 99సీట్లు కైవసం చేసుకొని సత్తా చాటింది. జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని […]

Written By:
  • NARESH
  • , Updated On : November 22, 2020 / 01:26 PM IST
    Follow us on

    తెలంగాణలో గత కొద్దిరోజులుగా రాజకీయవేడి రాజుకుంటోంది. దుబ్బాకలో ఉప ఎన్నిక ఫలితం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడం టీఆర్ఎస్ కు చెంపపెట్టులా మారింది. దీంతో టీఆర్ఎస్ సర్కార్ అలర్ట్ అయింది. ఈక్రమంలోనే వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈమేరకు టీఆర్ఎస్ శ్రేణులను రంగంలోకి దింపి దిశానిర్దేశం చేస్తున్నారు.

    Also Read: కేసీఆర్ వ్యూహం దెబ్బకొడుతోందా..?

    కిందటిసారి జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏకంగా 99సీట్లు కైవసం చేసుకొని సత్తా చాటింది. జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని టీఆర్ఎస్ ఏకపక్షంగా దక్కించుకుంది. అయితే ప్రస్తుతం నగరంలో పరిస్థితులు మారిపోయాయి. గతంలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను చాలావరకు నెరవేర్చకపోవడం.. కరోనా ఎఫెక్ట్.. ఇటీవల హైదరాబాద్లో వచ్చిన వరదలు ఇవన్నీ కూడా అధికార పార్టీకి కంటగింపుగా మారాయి.

    నగర ఓటర్లలో టీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉండటంతో ఈసారి టీఆర్ఎస్ ఏకపక్షంగా మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం లేదనే టాక్ విన్పిస్తోంది. అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం 110 కార్పొరేటర్లను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉపాధ్యాయులను దూరం పెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

    తెలంగాణలో కరోనా కారణంగా పాఠశాలలు పూర్తిగా తెరుచుకోలేదు. బోధన అంతా ఆన్ లైన్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులంతా ఖాళీగా ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉపాధ్యాయులకు ఎన్నికల సంఘం బాధ్యతలు అప్పగిస్తుందని భావించగా అనూహ్యంగా వారిని దూరం పెట్టింది. ఉపాధ్యాయులు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండటంతోనే ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరుగుతోంది.

    Also Read: పవన్ కళ్యాణ్ ట్రోల్స్ బారిన పడ్డాడా?

    ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలు అప్పగించకూడదని గతంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేశాడు. ఇక పీఆర్సీ, డీఏ, టీఏ తదితర చాలా డిమాండ్లు పెండింగ్ లో ఉన్నాయి. ఉపాధ్యాయవర్గాల్లో కేసీఆర్ సర్కార్ పై తీవ్రమైన ఆగ్రహజ్వాలలు ఉన్నాయి. కరోనా వేళ జీతాలు కూడా కట్ చేయడంతో వారంతా గుర్రుగా ఉన్నారు. వారి డిమాండ్లను ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వానికి ఉపాధ్యాయులు షాకిస్తారనే దూరంగా పెట్టినట్టు తెలుస్తోంది. ఉపాధ్యాయులు ఖాళీగా ఉన్న సమయంలో ఎన్నికల విధుల దూరంగా పెట్టడం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతోన్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నా ప్రభుత్వంగానీ.. ఎన్నికల సంఘంగానీ వారిని పట్టించుకోకపోవడం వెనుక కారణం అదేనన్న చర్చ సాగుతోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్