https://oktelugu.com/

టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనా..?

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం నిత్యం వేడిగానే ఉంటోంది. ఇక్కడి ప్రజలు వ్యక్తికి విలువనివ్వడంతో కొత్త కొత్త నాయకులు పుట్టుకొస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేంతవకు కేసీఆర్ పూజ చేసిన ప్రజలు అదే కేసీఆర్ పై ఇప్పుడు తిరగబడుతున్నారు. ఆ తరువాత కేసీఆర్ కు ప్రత్యామ్నాయం బండిసంజయ్ అని అందలమెక్కించారు. అయితే ఒకటి, రెండు ఎన్నికల్లో మినహా ‘బండి’ముందుకు పోకపోవడంతో ఇప్పుడు ఆ పార్టీపై కూడా నమ్మకం కోల్పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక కనుమరుగవుతుందన్న కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి […]

Written By:
  • NARESH
  • , Updated On : July 3, 2021 / 09:22 AM IST
    Follow us on

    తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం నిత్యం వేడిగానే ఉంటోంది. ఇక్కడి ప్రజలు వ్యక్తికి విలువనివ్వడంతో కొత్త కొత్త నాయకులు పుట్టుకొస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేంతవకు కేసీఆర్ పూజ చేసిన ప్రజలు అదే కేసీఆర్ పై ఇప్పుడు తిరగబడుతున్నారు. ఆ తరువాత కేసీఆర్ కు ప్రత్యామ్నాయం బండిసంజయ్ అని అందలమెక్కించారు. అయితే ఒకటి, రెండు ఎన్నికల్లో మినహా ‘బండి’ముందుకు పోకపోవడంతో ఇప్పుడు ఆ పార్టీపై కూడా నమ్మకం కోల్పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక కనుమరుగవుతుందన్న కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి చీఫ్ గా నియామకం కావడంతో పార్టీలో, రాష్ట్ర ప్రజల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

    తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఇంకా పూర్తి బాధ్యతలు తీసుకోకముందే రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ముందుగా ఆయనపై ఉన్న అసంతృప్తి మరకను తుడిచేస్తున్నారు. సీనియర్ నాయకులను కలుస్తూ అందరినీ కలుపుకుపోతున్నారు. అయితే ఇంకా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలను కలువకపోవడం చర్చనీయాంశంగా మారింది. మీడియా కూడా కొత్త నాయకుడి కొత్త ఉత్సాహన్ని పదే పదే చూపిస్తుండడంతో రాష్ట్ర ప్రజల్లోనూ కొత్త ఆసక్తి నెలకొంది.

    ఇక రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ ప్రకటన వెలువడిన మరుసటి రోజు నుంచే అధికార టీఆర్ఎస్, ఇతర పార్టీలపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా కేసీఆర్ ను టార్గెట్ చేసి పదునైన పదాలతో విమర్శలు చేస్తున్నారు. తాజాగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లెవనెత్తిన జల వివాదాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు రేవంత్ రెడ్డి పెద్ద వ్యూహమే రచిస్తున్నట్లు సమాచారం. జల వివాదంతో టీఆర్ఎస్ ఉపఎన్నికలో లబ్ధి పొందాలను చూస్తోందని కొందరు అంటున్నారు. దీంతో తెలంగాణ సెంటిమెంట్ ను తెరపైకి తెచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.

    అయితే ఈ వివాదంపై అవసరమైతే పార్లమెంట్ లో రచ్చ చేయడానికి రెడీ అవుతున్నారు. త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో జలవివాదంపై పెద్ద ఆందోళన చేస్తే టీఆర్ఎస్, వైసీపీలతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఇరకాటంలో పెట్టాలని రేవంత్ ప్రణాళిక వేస్తన్నట్లు తెలుస్తోంది. ఇందుకు పార్లమెంట్ లోని కాంగ్రెస్ నాయకులతో పాటు బీజేపీ వ్యతిరేక పార్టీల మద్దతు కోసం యత్నిస్తున్నారు.

    ఇక ఇప్పటి వరకే కేసీఆర్ ఉత్తర తెలంగాణ కు మాత్రమే నీటి ప్రాజెక్టులు కట్టారని, దక్షిణ తెలంగాణను పట్టించుకోలేదని వాదించేవారు. అయితే అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఉత్తర తెలంగాణలో పట్టు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలో పర్యటించేందుకు రెడీ అవుతున్నాడట. ఈ పర్యటనతో కేసీఆర్ పై వ్యతిరేకతను తీసుకురావడంతో పాటు పార్టీ పటిష్టతను కూడా పెంచవచ్చని ఆలోచిస్తున్నారు. ఏదీ ఏమైనా ఇప్పుడున్నట్రెండ్ నాయకుల్లోని రేవంత్ రెడ్డి ముందంజలో ఉన్నారని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు.