CM Ramesh: ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నారో సినీకవి. కానీ రాజకీయ నేతలకు కూడా విశ్వాసాలు వేరే ఉంటాయి. అది ఎన్నో సార్లు రుజువైంది కూడా. స్వామి స్వకార్యం రెండూ తీర్చుకునే నేతలు కొందరుంటారు. పార్టీ మారినా వారి మూలాలు మాత్రం వీడిన పార్టీపైనే ఉండటం గమనార్హం. ఇదే కోవలో సీఎం రమేష్ కూడా వస్తారు. ఆయన టీడీపీని వీడినా దాని ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారన్నది సత్యం. ఎవరు కాదనలేని నిజం. నిలువెత్తు నిదర్శనం. స్వామి భక్తికి సాటిలేదు గువ్వల చెన్నా అన్నట్లు రమేష్ భక్తికి అందరు ఆశ్చర్యపోతుంటారు.

టీడీపీ హయాంలోనే రెండు సార్లు రాజ్యసభ పదవి పొందిన రమేష్ దాని కోసం ఎంతకైనా తెగిస్తారు. ఎందుకంటే టీడీపీ అంటే అంత ఇష్టం. చంద్రబాబు అంటే ప్రేమ. బాబు అధికారంలో లేకపోతే ఆయనకు కూడా ఏదో లా ఉంటుంది. అందుకే టీడీపీ కోసం తివాచీలు పరచడానికి ఎప్పుడు రెడీగానే ఉంటారు. దీంతో చంద్రబాబు ఇష్టపడే నాయకుల్లో సీఎం రమేష్ ఒకరు కావడం గమనార్హం.
Also Read: జగన్ కు ఆ దమ్ముందా? జర్నలిస్ట్ సాయి సంచలన వ్యాఖ్యలు
అయితే ఇటీవల కాలంలో టీడీపీపై దాడులు పెరుగుతున్నాయి. కేసుల పరంపర కొనసాగుతోంది. దీంతో సీఎం రమేష్ స్పందిస్తున్నారు. తమ అధినేతపై ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తే సహించేది లేదని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా పోలీస్ అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పేశారు. దీంతో ఆయన ప్రస్తుతం కొనసాగుతోంది మాత్రం బీజేపీలో. కానీ రాష్ర్ట రాజకీయాలపై ఫోకస్ పెట్టి చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.
గతంలో పశ్చిమ బెంగాల్ విషయంలో కూడా బీజేపీ ఇలాగే వ్యవహరించి అభాసుపాలైంది. అధికారం కోల్పోయింది. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నా తమ నేత కోసం సీఎం రమేష్ ఎంతకైనా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఏపీ అధికారులపై అల్టిమేటం జారీ చేస్తూ టీడీపీకి వత్తాసు పలుకుతున్నారనేది ఓ వాదన వినిపిస్తోంది. దీంతో సీఎం రమేష్ టీడీపీపై ఉన్న ప్రేమతోనే ఇలా చేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే.
Also Read: తెలంగాణలో ‘ఒమిక్రాన్’ ఆంక్షలు.. వేడుకల్లేవ్.. ఇక ఇవి పాటించడం తప్పనిసరి