చిరంజీవి బర్త్ డే సందర్భంగా మెగా అభిమానులకు కన్నుల పండువైంది. రాఖీ పండుగ కూడా కలిసి రావడంతో చిరంజీవి ఇంటికి స్వయంగా జనసేనాని , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెళ్లారు. అన్నాదమ్ములు చిరంజీవి, పవన్, నాగబాబు కలిసి అన్యోన్యంగా ఆప్యాయతలు పంచుకున్న తీరు మెగా ఫ్యాన్స్ లో సంతోషాన్ని నింపింది.
ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు చాలా రోజుల తర్వాత ఈ సందర్బాన్ని పురస్కరించుకొని ట్వీట్ చేశాడు. చాలాకాలం తర్వాత జనసేనలో జాయిన్ అయిన రవణం స్వామి నాయుడు ఈరోజే ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. ‘చిరంజీవి-పవన్ కలిసిన సందర్భంగా మెగా ఐక్యతను , సేవా కార్యక్రమాలను మరింత అభివృద్ధి చేసి ప్రజా సేవలో ముందంజలో ఉండాలని ’ ఆశిస్తూ మెగా అభిమానులకు పిలుపునిచ్చారు.
ముఖ్యంగా మెగా అభిమానులను, జనసైనికులను ఏకతాటిపైకి నడిపించాలని.. బాధ్యతగా పనిచేయాలని తన కార్యవర్గ నేతలను కోరడం విశేషం. మెగా హీరోలకు మంచి పేరు తీసుకొని రావడమే కాక.. సంఘంలోని అభిమానులు, జనసైనికులకు గుర్తింపు వచ్చే విధంగా కృషి చేయాలని భావిస్తున్నట్టుగా రవణం స్వామినాయుడు ట్వీట్ చేశాడు.
ఇన్నాళ్లు చిరంజీవి వేరు.. జనసైనికులు వేరుగా రాజకీయం నడిచేది . కానీ ఇప్పుడు చిరంజీవి , పవన్ కల్యాణ్ ఆప్యాయత చూశాక వీరిద్దరూ ఒక్కటేనన్న చర్చ మెగా అభిమానుల్లో మొదలైంది. దీన్ని బట్టి చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నాడా? జనసేనకు సపోర్టుగా చిరు వస్తున్నాడా? అని అందరూ చర్చించుకుంటున్నారు.
రవణం స్వామి నాయుడు చిరంజీవి ఫ్యాన్స్, జనసైనికులు కలిసి పనిచేయాలని చేసిన పోస్ట్ దేనికి సంకేతం? అని పలువురు ఆసక్తిగా గమనిస్తున్నారు.
జనసేన తరుఫున చిరంజీవిని తీసుకురావాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న చర్చ కూడా సాగుతోంది. ఇప్పటికే నాగబాబు జనసేన తరుఫున యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి కూడా వస్తే నెక్ట్స్ లెవల్ లో జనసేన ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రవణం స్వామి నాయుడు మాటలను బట్టి చిరు రాక త్వరలోనే నెరవేరేలా కనిపిస్తోందని మెగా అభిమానులు అనుకుంటున్నారు.
*అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు గా *శ్రీ L. Shyam Prasad (విజయవాడ) గారిని శ్రీ. K. నాగేంద్ర బాబు గారు* నియమించారని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాము
*Congratulations to Sri. L. Shyam Prasad Garu*
*రవణం స్వామినాయుడు*
*అఖిల భారత చిరంజీవి* *యువత* pic.twitter.com/S2Hv9cef92— Ravanam Swami naidu (@swaminaidu_r) August 23, 2021