https://oktelugu.com/

లోకేష్ కోసం త్యాగం చేసేది చంద్రబాబా? మామ బాలయ్యనా?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఈ మధ్య రాజకీయాల్లో చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నాడు. ఇన్నాళ్లు ఆన్‌లైన్‌ వేదికగా రాజకీయాలు చేసిన.. చినబాబు ఇప్పుడు ఎట్టకేలకు కళ్లు తెరిచినట్లున్నాడు. ప్రజల మధ్య ఉంటేనే ప్లస్‌ అవుతుందని తెలుసుకున్నట్లు ఉన్నాడు. ఒకే.. పార్టీ భవిష్యత్తుకు ఇది మంచి పరిణామమే. కానీ.. నాటి మంగళగిరి నియోజకవర్గం కొట్టి దెబ్బ ఇంకా మాత్రం మరుపురావడం లేదంట! దాంతో చంద్రబాబు, బాలయ్యల్లో ఒకరిని త్యాగం చేయమని అడుగుతున్నారంట! మరిన్ని ఆంధ్ర రాజకీయ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2020 / 02:44 PM IST
    Follow us on


    టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఈ మధ్య రాజకీయాల్లో చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నాడు. ఇన్నాళ్లు ఆన్‌లైన్‌ వేదికగా రాజకీయాలు చేసిన.. చినబాబు ఇప్పుడు ఎట్టకేలకు కళ్లు తెరిచినట్లున్నాడు. ప్రజల మధ్య ఉంటేనే ప్లస్‌ అవుతుందని తెలుసుకున్నట్లు ఉన్నాడు. ఒకే.. పార్టీ భవిష్యత్తుకు ఇది మంచి పరిణామమే. కానీ.. నాటి మంగళగిరి నియోజకవర్గం కొట్టి దెబ్బ ఇంకా మాత్రం మరుపురావడం లేదంట! దాంతో చంద్రబాబు, బాలయ్యల్లో ఒకరిని త్యాగం చేయమని అడుగుతున్నారంట!

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    2019 సార్వత్రిక ఎన్నికల్లో చినబాబుకు తగిలిన దెబ్బ అలాంటిదే మరి. ఒక్క ఓటమి రెండు విమర్శలను తెచ్చి పెట్టింది. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్‌ను గతంలో చంద్రబాబు మంత్రిని చేశారు. ఇది లోకేష్ రేంజ్ అంటూ రాజకీయంగా విమర్శలు వచ్చాయి. కొడుకుని కూడా గెలిపించుకోలేని అసమర్ధుడిగా బాబుకు విమర్శ మిగిలింది. కాబట్టి ఇకపై ఇటువైపు చూడకపోవడమే బెటరని చినబాబు నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

    Also Read: బాబును కూల్చింది.. ‘ఇసుక’ తుఫాన్‌ రాకుండా జగన్‌ చర్యలు

    మరోవైపు.. ఈ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగదని.. 2024కు ముందు ఎన్నికలు వస్తాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో అయితే హిందూపుర్.. లేదంటే కుప్పంలో పోటీచేయాలని చినబాబు ఆలోచిస్తున్నారంట. బాలయ్య నియోజకవర్గం హిందూపురంలో టీడీపీ నుంచి ఎవరు పోటీలో నిలిచినా గెలువడం పక్కా. కాబట్టి అదైతేనే సేఫ్ జోన్ అని చినబాబు భావిస్తున్నారంట. లేకపోతే గత మూడున్నర దశాబ్దాలుగా వారి చేతిలోనే ఉన్న కుప్పం నుంచి పోటీచేయాలని భావిస్తున్నాడంట.

    Also Read: రాజకీయ అడ్డాగా మారిన దుర్గ గుడి

    అంతేకాదు.. ఒకటితో సరిపెట్టుకోకుండా రెండు నియోజకవర్గాల్లోనూ పోటీ చేయాలని అనుకుంటున్నాడట. ఒకచోట మైనస్‌ అయినా.. ఇంకోచోట కలిసివస్తుందని ఆయన ఆలోచన. సీమ ప్రాంతం అయితేనే సేఫ్ అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఆ త్యాగం నాన్న గారైన బాబు చేస్తారా.. మామ గారైన బాలయ్య బాబు చేస్తారా.. ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఫ్యూచర్‌‌ రాజకీయాల కోసం చినబాబు కోరికను ఏ బాబు తీరుస్తాడో చూడాలి మరి.