https://oktelugu.com/

Chandrababu Pawan Kalyan: సంచలనం: సీఎం సీటును పవన్ కళ్యాణ్ కు త్యాగం చేయడానికి చంద్రబాబు ఓకే?

Chandrababu Pawan Kalyan: మహానాడు వేదికగా చంద్రబాబు బరెస్ట్ అయ్యారు. సేవ్ ఏపీ అంటూ నినదించారు. కోనసీమ అల్లర్లకు కారణం చెప్పారు. ఏపీ నుంచి జగన్ ను సాగనంపేలా ప్లాన్ చేశారు. నాకు సీఎం పదవి కొత్త కాదని.. రాష్ట్రం నాశనం కాకూడదనే తన ఆవేదన అన్నారు. దీన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో ఒకవేళ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే సీఎం కుర్చీని పవన్ కు త్యాగం చేయడానికి కూడా సిద్ధమేనని చంద్రబాబు […]

Written By:
  • NARESH
  • , Updated On : May 27, 2022 / 01:35 PM IST
    Follow us on

    Chandrababu Pawan Kalyan: మహానాడు వేదికగా చంద్రబాబు బరెస్ట్ అయ్యారు. సేవ్ ఏపీ అంటూ నినదించారు. కోనసీమ అల్లర్లకు కారణం చెప్పారు. ఏపీ నుంచి జగన్ ను సాగనంపేలా ప్లాన్ చేశారు. నాకు సీఎం పదవి కొత్త కాదని.. రాష్ట్రం నాశనం కాకూడదనే తన ఆవేదన అన్నారు. దీన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో ఒకవేళ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే సీఎం కుర్చీని పవన్ కు త్యాగం చేయడానికి కూడా సిద్ధమేనని చంద్రబాబు పరోక్షంగా సంకేతాలిచ్చారు..

    ఏపీలో జగన్ ను ఓడించడమే ధ్యేమయని మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించారు. ఈ క్రమంలోనే సీఎం పదవి తన కొత్తకాదని.. ప్రజల కోసం ఏ త్యాగమైనా చేస్తానని.. జగన్ ను గద్దెదించడమే ధ్యేయమన్నారు. దీన్ని బట్టి ఒకవేళ పొత్తుల ఎత్తుల్లో తేడా కొడితే పవన్ కళ్యాణ్ ను సీఎం చేయడానికి కూడా తనకు అభ్యంతరం లేదని చంద్రబాబు ఈ ప్రకటనతో ఒప్పుకున్నట్టైంది.

    టీడీపీ మహానాడు వేదికగా చంద్రబాబు చెలరేగిపోయారు. తన మనసులోనిది అంతా కక్కేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ వార్షిక పండుగ మహానాడు అట్టహాసంగా ప్రారంభమైంది. వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సంచలన ప్రసంగం చేశారు. అదే ఇప్పుడు వైరల్ అయ్యింది.

    వైసీపీ పాలనపై చంద్రబాబు చెలరేగిపోయారు. రాష్ట్రంలో గతంలో టీడీపీ ప్రభుత్వాల పాలనతో జగన్ పాలనను పోలుస్తూ చంద్రబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. క్విట్ జగన్ అని నినదించారు. ఏపీ నుంచి జగన్ ను అధికారం దించడమే లక్ష్యమని మహానాడు వేదికగా ప్రకటించారు.

    జగన్ పాలన నుంచి ఏపీని సేవ్ చేయాలని ప్రజలను కోరారు. కోన సీమ అల్లర్ల వెనుక జగన్ డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయని.. వైసీపీ ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ హత్యను కప్పిపుచ్చడానికే ఈ అల్లర్లు సృష్టించారని ఆరోపించారు. ఈ హత్య కేసుతో ఎస్సీల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని చంద్రబాబు అన్నారు.