https://oktelugu.com/

Chandrababu Crying: చంద్రబాబు.. నాడు ఏడిపించాడు.. నేడు ఏడ్చాడు

Chandrababu Crying: ఎదుటివారికి మనం ఒకవేలు చూపిస్తే మిగతా నాలుగు వేళ్లు మనకే చూపిస్తాయన్నది మరిచిపోకూడదు. అధికారంలో ఉనప్పుడు రెచ్చిపోయి ఏడిపిస్తే.. అధికారం పోయాక ఇలా గుక్కపట్టి ఏడ్వడంలో తప్పులేం కనపడవు. నాడు ఏడిపించి.. నేడు ఏడిస్తే దానికి సానుభూతి రాకపోకగా.. కౌంటర్లే పడుతాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు నిండు విలేకరుల సమావేశంలో కన్నీరు కార్చిన వైనంపై సెటైర్లు పేలుతున్నాయి. నాడు చంద్రబాబు హయాంలో తన చెప్పు చేతుల్లో ఉన్న మీడియాతో పవన్ కళ్యాణ్ ను, […]

Written By:
  • NARESH
  • , Updated On : November 19, 2021 / 04:37 PM IST
    Follow us on

    Chandrababu Crying: ఎదుటివారికి మనం ఒకవేలు చూపిస్తే మిగతా నాలుగు వేళ్లు మనకే చూపిస్తాయన్నది మరిచిపోకూడదు. అధికారంలో ఉనప్పుడు రెచ్చిపోయి ఏడిపిస్తే.. అధికారం పోయాక ఇలా గుక్కపట్టి ఏడ్వడంలో తప్పులేం కనపడవు. నాడు ఏడిపించి.. నేడు ఏడిస్తే దానికి సానుభూతి రాకపోకగా.. కౌంటర్లే పడుతాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు నిండు విలేకరుల సమావేశంలో కన్నీరు కార్చిన వైనంపై సెటైర్లు పేలుతున్నాయి. నాడు చంద్రబాబు హయాంలో తన చెప్పు చేతుల్లో ఉన్న మీడియాతో పవన్ కళ్యాణ్ ను, జగన్ ను, కాపు ఉద్యమనేత ముద్రగడ సహా పలువురిని టార్గెట్ చేసి ఏడిపించిన చంద్రబాబును ఇప్పుడు నాటి సంఘటనలను బయటకు తీసి మరీ ప్రత్యర్థులు ఏకిపారేస్తున్నారు.

    Also Read: నక్సలైట్ల బాంబు పేలుళ్లకు చలించని చంద్రబాబు.. ఇప్పుడిలా ఎందుకయ్యారు?

    చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటారు. న్యాయం కోసం చూసిన వారికి ఇప్పుడు చంద్రబాబు ఏడుపు వెటకారంగానే కనిపిస్తుంది. చాలా అంటే చాలా న్యాయం జరిగింది అనిపిస్తుంది. వైసీపీ చేసిన చర్యలను ఎవరూ సపోర్ట్ చేయరు… గానీ.. చంద్రబాబు లాంటి తిమ్మిని బమ్మిని చేసే నాయకుడికి మీరు ఎదుటి వాళ్లకి చేసే పనులు కూడా ఇలానే బాధ కలిగిస్తాయన్న వాస్తవం ఇప్పటికైనా తెలిస్తే మంచిదని వ్యతిరేకులు హితవు పలుకుతున్నారు. ఆ స్పృహ లోకి వచ్చే రోజు ఈరోజు వచ్చినందుకు దేవుడు ఉన్నాడు కౌంటర్ ఇస్తున్నాడు.

    విధి చాలా విచిత్రమైనది.. ప్రతిదీ వెనక్కి తిరిగి వస్తుంది. కొంచం లేటు అంతే.. ఆరు నెలలు మీరు చేసిన వికృత క్రీడ బహుశా ప్రపంచంలో ఎక్కడా జరగలేదు.. కర్మ అనుభవించాలి.. రేపు తుగ్లక్ కి కూడా తప్పదంటూ చంద్రబాబు కన్నీళ్ల పర్వంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి..

    pawan kalyan crying

    2018లో ఇదే చంద్రబాబు తనను సపోర్టు చేసి అధికారంలోకి రావడానికి దోహదపడ్డ జనసేనాని పవన్ కళ్యాణ్ ఇంతకంటే ఘోరంగా ఏడిపించిన వైనాన్ని ఎవరూ మరిచిపోరు. చంద్రబాబు సీఎంగా ఉండగా.. ఆయనకు అండగా నిలబడినందుకు పవన్ కు ఇచ్చిన ప్రతిఫలాన్ని నాడు ఆయన ఎండగట్టారు. ఏపీ సెక్రటేరియట్ వేదికగా చంద్రబాబు కొడుకు, అతడి స్నేహితుల ఆధ్వర్యంలో ఆరు నెలలుగా వారి సొంత అనుకూల మీడియా సంస్థలైన టీవీ9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఇతర కొన్ని చానెల్స్, తదితర సోషల్ మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ మీద.. ఆయన కుటుంబం మీద.. ఆయనను అభిమానించే వారి మీద నిరవధిక మీడియా అత్యాచారం జరిపారు. దీన్ని స్వయంగా పవన్ ట్వీట్ చేసి చంద్రబాబు కుతంత్రాలను ఎండగట్టారు.

    pawan kalyan tweets

    కొద్దిరోజుల పాటు పది కోట్లు డబ్బు ఖర్చు పెట్టి మరీ పవన్ కు సంబంధం లేని విషయాల్లోకి లాగి ఆయనకు జన్మనిచ్చిన తల్లిని నడిరోడ్డులో అసభ్యంగా శ్రీరెడ్డితో పచ్చి బూతులు తిట్టించి.. దానిని పదే పదే ప్రసారం చేసి డిబేట్లు పెట్టి దానిని టీడీపీ పత్రికల్లో సర్య్కూలేషన్ లో పెట్టి రచ్చ చేసిన వైనాన్ని ఎవరూ మరిచిపోరు. ఇప్పుడు నాడు పవన్ చేసిన ట్వీట్లనే బయటకు తీసి చంద్రబాబు వ్యతిరేకులు వైరల్ చేస్తున్నారు. చంద్రబాబు వరకూ వస్తే కానీ ఇది కనపడలేదా? అని మండిపడుతున్నారు. చంద్రబాబుది ముసలి కన్నీరు అని ఎండగడుతున్నారు.

    నాడు ఎస్పీ కొడితే పవన్ లేవనెత్తిన అంశాలు.. దానికి చంద్రబాబు ట్వీట్లు పెట్టి సెటైర్లు వేసిన విషయాలను బయటకు తీస్తున్నారు.నీకో న్యాయం.. మిగతా వారికి న్యాయమా? చంద్రబాబు అని ఆయన కన్నీళ్లను ఎద్దేవా చేస్తున్నారు. ఓ దాడి విషయంలో లోకేష్ చేసిన విమర్శలు అంతా ఇంతాకావు.. ఎస్పీ ని కొట్టించిన వైనాలు.. స్వయంగా జగన్ ను ఇటీవల పట్టాభితో తిట్టించిన బూతులకు లెక్కలేదా? చంద్రబాబు అని ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు.

    ఇక కాపుల కొట్లాటలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై ఎన్నో అభాండాలు, విమర్శలు చేయించి ఆయన రాజకీయాలకు దూరంగా జరిగేలా చేయడంలో చంద్రబాబు హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ ను సైతం వైఎస్ వివేకా హత్య కేసులో, కోడికత్తి కేసులో ఎంతలా చంద్రబాబు అభాసుపాలు చేయించాడో అందరికీ తెలిసిందే. మొన్న టీడీపీ నేత పట్టాభితో బండ బూతు తిట్టించాడు. ఇక వైసీపీ రెబల్ ఎంపీ రఘురామను టీడీపీ అనుకూల చానెల్స్ కు అప్పగించి రెండేళ్లుగా ఎంత రచ్చ చేయిస్తున్నాడో అంతా చూస్తున్నాం.. దీనివెనుక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నాడన్నది బహిరంగ రహస్యం. ఇప్పుడు తన దాకా వచ్చేసరికి చంద్రబాబు కుయ్యో మొర్రో అనడమే ఎబ్బెట్టుగా ఉందని ప్రత్యర్థులు ఆడిపోసుకుంటున్నారు.

    చేసింది అంతా జరిగింది అంతా చంద్రబాబు హయాంలోనే.. కానీ ఇప్పుడు గురువిందలా మీడియా ముందు ఇదే చంద్రబాబు కన్నీరు కార్చాడు. నాడు పవన్, జగన్ ఇతర బాధితులు ఏడ్వలేదు.. ఇప్పుడు చంద్రబాబు ఏడ్చాడు అంతే తేడా.. అంతకుమించిన అవమానాలను చంద్రబాబు హయాంలోనే జరిగాయి. కానీ వారు మౌనంగా భరించారు. ఇప్పుడు చంద్రబాబు దాకా వస్తే కానీ ఆ ఆవేదన ఆయనకు అర్థం కాలేదు. తనదాకా వస్తే కానీ ఈ అవమానాల తీవ్రత చంద్రబాబుకు అర్థం కాలేదు. అందుకే అంటారు చేసుకున్న వారికి చేసుకున్నంత అని..

    Also Read: వైరల్ వీడియో: వెక్కి వెక్కి ఏడ్చిన చంద్రబాబు.. సంచలన శపథం