24గంటల్లో 1543 కరోనా పాజిటివ్ కేసులు!

భారత్‌ లో కరోనా పాజిటివ్ కేసులు 29,435కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 30 వేలకు చేరువవుతుండటం గమనార్హం. గడచిన 24 గంటల్లో కొత్తగా భారత్‌ లో 1543 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా దేశవ్యాప్తంగా 62 మంది మృతి చెందినట్లు అగర్వాల్ తెలిపారు. ఇప్పటివరకూ భారత్‌ లో కరోనా బారిన పడిన వారిలో 6,864 మంది […]

Written By: Neelambaram, Updated On : April 28, 2020 5:34 pm
Follow us on

భారత్‌ లో కరోనా పాజిటివ్ కేసులు 29,435కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 30 వేలకు చేరువవుతుండటం గమనార్హం. గడచిన 24 గంటల్లో కొత్తగా భారత్‌ లో 1543 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా దేశవ్యాప్తంగా 62 మంది మృతి చెందినట్లు అగర్వాల్ తెలిపారు. ఇప్పటివరకూ భారత్‌ లో కరోనా బారిన పడిన వారిలో 6,864 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

కరోనా నుండి కోలుకుంటున్న వారి శాతం రోజురోజుకూ క్రమంగా పెరుగుతున్నట్లు లవ్ అగర్వాల్ ప్రకటించడం కాస్త ఊరట కలిగించే విషయం. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని, సాంకేతికతను ఉపయోగించి కరోనా కేసులను గుర్తిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.