
బీజేపీ ఇప్పుడు ఏపీలో వన్ వేలో వెళ్తోంది. రాష్ట్రంలో రెండోస్థానమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అయితే అది సాధ్యం కావాలంటే టీడీపీని బలహీనం చేయాలి. అధికార వైసీపీలో వ్యతిరేకత పెంచాలి. ఈ రెండులక్ష్యాలతో ఏపీ బీజేపీ నేతలు ముందుకు సాగుతున్నారు. తిరుపతి ఉప ఎన్నికను పక్కకు పెడితే.. హిందూ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేలా బీజేపీ నేతలు సరికొత్త వ్యూహంతో రథయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. ఈ రథయాత్ర వచ్చేనెల 4వ తేదీన ప్రారంభించే అవకాశం ఉంది.
Also Read: పెళ్లికి రెండు రోజుల ముందు ఫోన్ స్విఛాఫ్ చేసిన పెళ్లికూతురు.. చివరకు..?
కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకు ఈ రథయాత్ర జరగనుంది. ఇటీవల ధ్వంసమైన అన్ని ఆలయాలను పరిశీలించే విధంగా ఈ యాత్ర ముందుకు సాగనుంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమను కలుపుతూ.. ఈ రథయాత్రకు సంబంధించిన రూట్ మ్యాపును రూపొందించారు. అయితే ఈ రథయాత్ర విషయంలో ఎంత వరకు జనం సానుకూలంగా ఉన్నారు..? అన్నది పక్కన పెడితే.. దీంతో ప్రజల ఇంటెన్షన్ను తమ వైపు తిప్పుకోవచ్చనన్న ఆలోచనలో బీజేపీ అధినేత సోము వీర్రాజు ఉన్నారు.
ఇక ప్రభుత్వం నుంచి రథయాత్రకు ఎన్ని అడ్డంకులు ఏర్పడినా.. అవి తమకు కలిసి వస్తాయని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. రథయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని.. తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు తన యాత్రను అడ్డకుంటే.. హిందువులను అడ్డుకున్నట్టేనని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అందుకే రథయాత్ర జరిగినా.. జరగక పోయినా.. తమకు లాభమేనని బీజేపీ నాయకులు అంటున్నారు.
Also Read: ఎస్ఈసీపై పెద్దిరెడ్డి.. సజ్జల తిట్ల దండకం..
దీంతో పాటు తిరుపతి ఉప ఎన్నికలపై కూడా రథయాత్ర ప్రభావం ఉండనుంది. అందుకే వారంరోజుల పాటు మాత్రమే కొనసాగేలా ఈ యాత్రను ప్లాన్ చేశఆరు.. సోము వీర్రాజు. రథయాత్ర రెండు విధాలు ఉపయోగ పడుతుందని భావిస్తున్నారు. అటు పార్టీ బలోపేతానికి, ఇటు తిరుపతి ఉప ఎన్నికకు ఇది ఉపకరిస్తుందని.. అంచనాలో ఉన్నారు. మొత్తం మీద రథయాత్ర ఏపీ బీజేపీలో సరికొత్త మార్పులు తీసుకు వస్తుందని అంతా అనుకుంటున్నారు. తిరుపతి ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు ఏపీలో ఆలయాల దాడుల అంశాలను నాన్చుతూ.. ఉండాలని బీజేపీ భావిస్తోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్