BJP: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ పెట్టింది. ఇటీవల తెలంగాణ ఏర్పాటు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారని చెప్పిన మాటలను టీఆర్ఎస్ నాయకులు తప్పుబడుతూ బీజేపీని నిందించిన నేపథ్యంలో వారిని ఇరుకున పెట్టేందుకు ఓ కొత్త ప్రణాళిక రచించింది. టీఆర్ఎస్ ను సైతం ఇరుకున డేసే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలుకు సంకల్పించింది. దీనికి గాను కార్యాచరణ ప్రణాళికకు ముందుకొచ్చింది. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చి తాము కూడా విభజనకు వ్యతిరేకం కాదని చాటిచెప్పేందుకు నిర్ణయించుకుంది. దీంతో టీఆర్ఎస్‌ను సైతం నడిబజార్లో నిలబెట్టి కడిగేయాలని భావించినట్లు కనిపిస్తోంది.

ఈ నెల 17న కేంద్రం విభజన హామీల అమలుపై సమావేశం నిర్వహించింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఉద్దేశిస్తోంది. ఇన్నాళ్లు అటు ఏపీ, ఇటు తెలంగాణ తమకు ప్రయోజనాలు కల్పించడం లేదని చెబుతున్న సందర్భంలో వారి ఆశలు తీర్చాలని చూస్తోంది. పైపెచ్చు విమర్శలు చేస్తున్న టీఆర్ఎస్ కు కూడా గుణపాఠం చెప్పాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఇన్‌స్టాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న టాప్ 10మంది వీరే..!
సమావేశంలో హామీల అమలుపై చర్చించి ఓ నిర్ణయానికి రానుందని సమాచారం. దేశంలో మూడో కూటమి ఏర్పాటుతో బీజేపీకి చెక్ పెట్టాలని భావిస్తున్న కేసీఆర్ కు సొంత రాష్ట్రంలోనే దెబ్బకొట్టాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్న ఆరోపణలకు చెక్ పడనుందని భావిస్తున్నారు. ఇన్నాళ్లు బీజేపీని లక్ష్యం చేసుకుని మాట్లాడే టీఆర్ఎస్ కు ఇక కాలం చెల్లినట్లే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మొత్తం తొమ్మిది అంశాలను గురించి ఆరా తీయనుంది. వాటి అమలులో వచ్చే సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. ఇందుకు పటిష్ట యంత్రాంగాన్ని నియమించి వాటిని తీర్చాలని చూస్తోంది. ఇన్నాళ్లు వేచి చూసినా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ వాదనలను కొట్టిపారేసి దాన్ని ఏకాకిని చేయాలని ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.
ఏపీ విభజన విషయంలో ప్రధాని సరిగా చేయలేదని చెప్పారు కానీ ఎందుకు చేశారని పేర్కొనలేదు. కానీ ప్రతిపక్షం అదే పాయింట్ ను పట్టుకుని రాద్దాంతం చేస్తోంది. కేంద్ర పథకాలతో తన పథకాలుగా చెప్పుకుని పబ్బం గడుపుకునే టీఆర్ఎస్ కు ఇక ఆ చాన్స్ ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. తమ పథకాలను తమమే అని నిరూపించుకుని టీఆర్ఎస్ కు చెక్ పెట్టాలని యత్నిస్తోందని తెలుస్తోంది.
Also Read: కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్న రోజా.. కారణమేంటబ్బా..?