
నాయకులు ఆశలతీరంలో ఓలలాడడం చూస్తుంటాం. జీవితంలో ఎమ్మెల్యే అయిన వాడు మంత్రి కావాలని కలలు కంటుంటారు. కానీ ఆ అవకాశం అందరికి రాదు. దానికి అదృష్టం ఉండాలి. అంతేకాని దేవుడి దయతోనో, మంత్రాలతోనో కాదు. వైసీపీలో సీనియర్ నేత అంబటి రాంబాబు. ఆయన రాజకీయ ప్రస్థానం ఎప్పుడో ప్రారంభం అయింది.1989లోనే గుంటూరు జిల్లా ేపల్లె నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తరువాత రెండు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో 2004లో టికెట్ ాలేదు. ఈ క్రమంలో 2004లో పార్టీ అధికారంలోకి వచ్చాక రాంబాబుకు ఏఫీఐఐసీ చైర్మన్ పదవి కట్టబెట్టారు.
వైఎస్ మరణానంతరం రాంబాబుకి జగనే లైఫ్ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో పోటీ ఉన్నా సత్తెనపల్లి సీటును ఆయనకే కేటాయించారు. ఈ ఎన్నికల్లో రాంబాబు దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేతిలో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో సీటు వస్తుందో లేదో అనే అనుమానమున్నా అంబటికి మరోసారి పోటీ చేసే అవకాశం వచ్చింది. దీంతో కోడెలపై విజయం సాధించారు. 1989 తరువాత 30 ఏళ్లకు మళ్లీ అసెంబ్లీ మెట్లు ఎక్కారు.
త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉండడంతో రాంబాబు మంత్రి పదవిపై ఆశలు పెంచుకుంటున్నారు. తన సీనియార్టీయే తనకు మంత్రి పదవి తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ రాజకీయ సమీకరణల నేపథ్యంలో రాంబాబు కోరిక నెరవేరుతుందో లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంబటి వాయిస్ వినిపిస్తున్నా పెద్దగా పట్టించుకునే వారు లేరు. కేబినెట్ లో ఇప్పటికే నలుగురు కాపు నేతలుండడంతో వీరిలో ఎవరు బయటకు వెళతారు? ఎవరిని లోపలికి ఆహ్వానిస్తారో అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
అంబటి రాంబాబుకు ఎమ్మెల్యేగా ఇదే చివరి అవకాశం కావచ్చు. అందుకే ఎలాగైనా మంత్రి పదవి సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. జీవితంలో ఒక్కసారైనా మంత్రి అని పిలిపించుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.ఏది ఏమైనా రాంబాబు కోరిక నెరవేరుతుందో లేదో భవిష్యత్తే నిర్ణయించాలి. ఆశలు అందరికి ఉంటాయి. కానీ అవి నెరవేరేది కొందరికే.