Homeజాతీయ వార్తలుIran Vs USA Conflict: ఇరాన్, అమెరికా: మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. ఇక జరిగేది అదే

Iran Vs USA Conflict: ఇరాన్, అమెరికా: మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. ఇక జరిగేది అదే

Iran Vs USA Conflict: అహంకారపూరితమైన వ్యక్తిత్వం ఉన్న ఇద్దరు వ్యక్తులు ఏ కోశాన కూడా కలవలేరు. ఒకవేళ కలిసినా కలిసికట్టుగా ఉండలేరు. ఇప్పుడు ఇదే అమెరికా, ఇరాన్ మధ్య జరిగింది..కొంత కాలంగా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. అసలు ఇరాన్ మీద అమెరికా ఎందుకు యుద్ధం చేస్తోంది.. ఈ స్థాయిలో ఎందుకు దాడులకు పాల్పడుతోంది.. అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. ఇక ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల మీద ఎందుకు యుద్ధం […]

Iran Vs USA Conflict: అహంకారపూరితమైన వ్యక్తిత్వం ఉన్న ఇద్దరు వ్యక్తులు ఏ కోశాన కూడా కలవలేరు. ఒకవేళ కలిసినా కలిసికట్టుగా ఉండలేరు. ఇప్పుడు ఇదే అమెరికా, ఇరాన్ మధ్య జరిగింది..కొంత కాలంగా ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. అసలు ఇరాన్ మీద అమెరికా ఎందుకు యుద్ధం చేస్తోంది.. ఈ స్థాయిలో ఎందుకు దాడులకు పాల్పడుతోంది.. అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. ఇక ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల మీద ఎందుకు యుద్ధం చేస్తోంది.. ఉగ్రవాద మూలాలు ఉన్న వ్యక్తులకు ఎందుకు కాపలాగా ఉంటోంది.. అనే ప్రశ్నలకు సమాధానం దొరికే పరిస్థితి లేకుండా పోయింది.

అమెరికా దాడులు చేస్తున్నా సరే ఇరాన్ తగ్గడం లేదు.. ఇజ్రాయిల్ భయోత్పాతం సృష్టిస్తున్నప్పటికీ ఇరాన్ వెనకడుగు వేయడం లేదు. ఈ రెండు దేశాలను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే.. గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తోంది ఇరాన్. అంతేకాదు ప్రపంచ ఆయిల్ ట్రేడ్ కు అత్యంత కీలకమైన హర్ముజ్ జల సంధిని మూసివేసింది. దీంతో యావత్ ప్రపంచం మొత్తం ఇబ్బంది పడడం మొదలైంది. గ్యాస్ సరఫరాలేదు. క్రూడ్ ఆయిల్ అయిపోయింది. దీంతో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేసింది. సీజ్ ఫైర్ కు ఒప్పించింది. అయినప్పటికీ ఇజ్రాయిల్ తగ్గలేదు. ఏవో సాకులు చూపించి లెబనాన్ మీద దాడులు చేసింది. ఈ క్రమంలో ఆదివారం ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరించడానికి పాకిస్తాన్ పూనుకుంది. తమ దేశం వేదికగా చర్చలు జరగాలని కోరింది. దానికి అమెరికా ఒప్పుకుంది. ఇరాన్ కూడా ఓకే చెప్పింది.

ఈ చర్చలు ఫలప్రదం అవుతాయని ప్రపంచంలో ఎవరికి కూడా నమ్మకం లేదు. ఎందుకంటే అవి జరిగేది పాకిస్తాన్ వేదికగా.. పాకిస్తాన్ ఎలాంటి దేశమో అందరికీ తెలుసు. అప్పుడు అక్కడ జరిగే చర్చలు విజయవంతమవుతాయని ఎవరికీ నమ్మకం లేదు. ఇక ఇప్పుడు చర్చలు విఫలమయ్యాయి కాబట్టి.. ఇరాన్ తగ్గదు. గల్ఫ్ దేశాల మీద దాడులను తీవ్రతరం చేస్తుంది. ఆయిల్ రిఫైనరీలు.. విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంది. ఇక అమెరికా, ఇజ్రాయిల్ దాడులను మరింత తీవ్రతరం చేస్తాయి. ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బ కొడతాయి. ఇరాన్ దేశానికి కాసులను తెప్పించే క్రూడ్ ఆయిల్ వ్యవస్థల మీద దాడులు చేస్తాయి. ఒకవేళ ఇరాన్ గనక ఈ యుద్ధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలి అనుకుంటే.. హర్ముజ్ జల సంధిని శాశ్వతంగా మూసివేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ప్రపంచం మొత్తం నరకం చూడాల్సి ఉంటుంది. అదే జరిగితే ధరలు పెరుగుతాయి. యావత్ ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అవుతుంది.. అయితే పరిస్థితులు ఇక్కడ దాకా దారి తీస్తాయా.. మళ్లీ చర్చలు మొదలవుతాయా.. సీజ్ ఫైర్ ఒప్పందానికి రెండు దేశాలు కట్టుబడి ఉంటాయా.. ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు లభించాల్సిన అవసరం ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper