https://oktelugu.com/

International Yoga Day 2024: యోగా డే : ప్రపంచవ్యాప్తంగా మోదీ తెచ్చిన మార్పు ఇదీ

ఫ్రాన్స్‌కు చెందిన 101 ఏళ్ల మహిళా యోగా గురువును ఈ ఏడాది పద్మశ్రీతో సత్కరించినట్లు మోదీ గుర్తుచేశారు. ఆమె ఎప్పుడూ భారత్‌కు రాకపోయినా యోగాపై అవగాహన కల్పించడం కోసం తన జీవితం ధారపోశారని ప్రశంసించారు.

Written By:
  • Dharma
  • , Updated On : June 21, 2024 10:36 am
    International Yoga Day 2024

    International Yoga Day 2024

    Follow us on

    International Yoga Day 2024: విదేశాల్లో యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని గుర్తుచేశారు. 2015లో తొలిసారి యోగా గురించి ప్రస్తావించాక మార్పు మొదలైందని వెల్లడించారు. యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయన్నారు. శ్రీనగర్‌లోని డాల్‌ సరస్సు సమీపాన నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మోదీ పాల్గొన్నారు.

    యోగా గురవుకు సత్కారం..
    ఫ్రాన్స్‌కు చెందిన 101 ఏళ్ల మహిళా యోగా గురువును ఈ ఏడాది పద్మశ్రీతో సత్కరించినట్లు మోదీ గుర్తుచేశారు. ఆమె ఎప్పుడూ భారత్‌కు రాకపోయినా యోగాపై అవగాహన కల్పించడం కోసం తన జీవితం ధారపోశారని ప్రశంసించారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో యోగాపై అధ్యయనాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే అనేక పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయని తెలిపారు. యోగా ఇప్పుడొక దైనందిన కార్యక్రమమైందని పేర్కొన్నారు. దీని ప్రాముఖ్యతను అనేక దేశాధినేతలు తనని అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు.

    కశ్మీర్‌లో యోగా డే..
    ఇదిలా ఉండగా అంతర్జాతీయ యోగా డే దశాబ్ది వేడుకలను ఈ ఏడాది కశ్మీర్‌లో నిర్వహించాలని మోదీ నిర్ణయించారు. దీంతో కశ్మీర్‌ వ్యాప్తంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అయితే భారీ వర్షం కారణంగా బహిరంగ ప్రదేశంలో నిర్వహించడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో వేదికను షేర్‌ ఏ కశ్మీర్‌ సమావేశ మందిరానికి మార్చారు.