International Yoga Day: ప్రాచీన భారతం నుంచి.. ఆధునిక ప్రపంచం వరకు.. యోగా ప్రస్థానం ఇదీ!

యోగా 5 వేల ఏళ్ల క్రితం భారత దేశంలోనే పుట్టింది. ఇది శారీరక భంగిమలు, శ్వాస వ్యాయామాలు, ధ్యానాన్ని మిళితం చేస్తుంది. రుగ్వేదం వంటి ప్రాచీన గ్రంథాలు యోగాభ్యాసాలను ప్రస్తావించాయి.

Written By: Raj Shekar, Updated On : June 21, 2024 10:12 am

International Yoga Day

Follow us on

International Yoga Day: జూన్‌1.. అంతర్జాతీయ యోగా దినోత్సవం. భారత దేశంలో పుట్టిన యోగా.. నేడు ప్రపంచ స్థాయి వరకు ఎదిగింది. ఏటా యోగా సాధకులు పెరుగుతున్నారు. ఇలా ఎంతో ప్రాముఖ్యతను చాటుకుంటోంది భారతీయ యోగా. ఆరోగ్య పరంగా యోగా విశిష్టతలను గుర్తించిన ఐక్యరాజ్యసమితి 2014లో జూన్‌ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఆరోగ్యం, శ్రేయస్సు కోసం యోగా ప్రయోజనాలను ప్రధాని మోదీ నొక్కి చెబుతూ ఈ ఆలోచనను ప్రతిపాదించారు.

ప్రాచీన మూలాలు..
యోగా 5 వేల ఏళ్ల క్రితం భారత దేశంలోనే పుట్టింది. ఇది శారీరక భంగిమలు, శ్వాస వ్యాయామాలు, ధ్యానాన్ని మిళితం చేస్తుంది. రుగ్వేదం వంటి ప్రాచీన గ్రంథాలు యోగాభ్యాసాలను ప్రస్తావించాయి. శతాబ్దాలుగా వివిధ సంప్రదాయాలు, ఆలోచనల ద్వారా యోగా పుట్టుకొచ్చింది.

నేడు ప్రపంచ గుర్తింపు..
20వ శతాబ్దంలో యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు, ఆదరణ పొందింది. స్వామి వివేకానంద, బీకేఎస్‌.అయ్యంగార్‌ వంటి ప్రతిభావంతమైన వ్యక్తులు యోగాను పశ్చిమ దేశాలకు విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. నేడు కోట్లాది మంది యోగాను శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం అభ్యసిస్తున్నారు.

ప్రయోజనాలు ఇవీ..
యోగాను ప్రస్తుతం లక్షల మంది నిత్య జీవితంలో భాగం చేసుకున్నారు. యోగాతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నారు. బలం, సమతుల్యతను మెరుగుపరుస్తుంది. పని ఒత్తిడి, ఆందోళన, మానసిక ఒత్తిళ్లకు మంచి ఔషధంగా యోగా పనిచేస్తుంది. దీర్ఘకాలిక నొప్పులనుంచి విముక్తి పొందేందుకు ఒక సాధనంగా పనిచేస్తుంది.

ఆధునిక పద్ధతులు..
ఇక ఆధునిక యోగా వివిధ జీవన విధానాలకు అనుగుణంగా మారింది. హఠ, విన్యాస, అష్టాంగ వంటి భిన్న శైలులు ఉన్నాయి. యోగా స్టూడియోలు, ఆన్‌లైన్‌ తరగతులు , ఫిట్‌నెస్‌ స్థాయిలకు అందుబాటులో ఉంటున్నాయి.

ఇలా ప్రాచీన భారతదేశం నుంచి ఒక సంప్రదాయంగా వస్తున్న యోగా ఇప్పుడు ప్రపంచ నలుమూలలకు వాపించింది. పాశ్చాత్య దేశాల్లో యోగాను రెగ్యులర్‌గా ప్రాక్టీస్‌గా చేస్తుంటారు. ఎక్కువ మంది ప్రజలు యోగాను స్వీకరిస్తున్నందున, దాని ప్రయోజనాలు కోట్ల మంది జీవితాలను సుసంపన్నం చేస్తుంది.