Delhi Police operation success: భారత్‌లో అల్లర్లు, దాడులు చేసేందుకు పాకిస్తాన్ సకల ప్రయత్నాలు చేస్తోంది. మన నిఘా వర్గాలు, పోలీసులు, సైన్యం ఈ కుట్రలను 99 శాతం పసిగడుతున్నాయి. ఒకటి రెండు మాత్రం మిస్ అవుతున్నాయి. అలాంటి సమయంలో పహల్గాం దాడి, తాజాగా ఢిల్లీ పేలుడు ఘటన జరిగాయి. ఢిల్లీ ఘటన తర్వాత పోలీసులు తాజాగా సోదాలు విస్తృతం చేశారు. ఈ తనిఖీల్లో అంతర్జాతీయ ఆయుధ సరఫరా ముఠాను పట్టుకున్నారు.
ఢిల్లీ పోలీసులు పాకిస్తాన్ ఐఎస్‌ఐకి సంబంధిన ఆయుధాలను డ్రోన్ల ద్వారా భారత్‌లోకి సరఫరా చేస్తున్న ముఠాను అరెస్టు చేశారు. ఈ ముఠా అధునాతన టర్కీ తయారీ px–5.7, చైనా తయారీ px–3 పిస్టళ్లు, 92 రౌండ్లను స్వాధీనం చేసుకున్నారు. విభాగం పరిశోధనల ప్రకారం, ఈ ముఠా డ్రోన్లను అతి తక్కువ ఎత్తులో ఎగిరిస్తూ పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో జీపీఎస్ సూచించిన ప్రదేశాల వద్ద ఆయుధాలను డ్రాప్ చేస్తూ, స్థానిక ముఠాలకు అందేలా చేస్తోంది. ఆయుధాలు దొరికిన తరువాత, వీటిని క్రిమినల్లు, హత్యల, దోపిడీల కోసం ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది.
పలువురి అరెస్ట్..
ఈ ఆయుధ ముఠాను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. మణిదీప్ సింగ్, దల్వీందర్, రోహన్ తోమర్, అజయ్ అలియాస్ మోను ను అరెస్టు చేశారు. వీరు పంజాబ్, ఉత్తరప్రదేశ్ వాసులుగా, పంజాబ్–యూఎస్ క్రిమినల్ గ్యాంగ్స్‌కు సంబంధం ఉన్నవారు. గ్యాంగ్ నేత సోను ఖత్రి (రాజేశ్ కుమార్) ప్రస్తుతం యూఎస్‌లో ఉన్న శ్రీమంత ఆయుధ వ్యాపార చరిత్ర కలిగిన వ్యక్తి. సోను ఖత్రి ఐఎస్‌ఐ సహకారంతో విక్రయానికి ఆయుధాలు సరఫరా చేస్తోంది. డ్రోన్ల వినియోగం ద్వారా రాడార్ గుర్తింపు తప్పించుకుని దేశంలోకి ఆయుధాలు పంపుతున్నారు. తాజా ఘటనతో ప్రస్తుతం పోలీసులు మరింత గట్టి చర్యలతో మిగతా కుట్రకారులను గుర్తించారు.
పక్కా సమాచారంతో..
నవంబర్ 19న పోలీసులకు సమాచారం అందింది. రోహిణిపట్‌లోని ఖాతూశ్యాం ఆలయం వద్ద గ్యాంగ్‌ను పట్టుకున్నారు. పిస్టళ్లు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఫిలాపూర్‌కు చెందిన మణిదీప్, లూధియానాకు చెందిన దల్వీందర్ చిన్ననాటి మిత్రులు, గ్యాంగ్‌స్టర్ జస్‌ప్రీత్‌తో వీరికి సంబంధాలు ఉన్నాయి. జస్‌ప్రీత్ పాక్‌లోని ఐఎస్‌ఐ నుంచి ఆయుధాలు భారత్‌లోకి తెప్పిస్తున్నట్లు గుర్తించారు. ఢిల్లీతోపాటు దేశంలోని పలు గ్యాంకులకు ఆయుధాలు అందించారు. ఈ గ్యాంగులు ఆయుధాలు ఉపయోగించి హత్యలు, దోపిడీలకు పాల్పడుతున్నాయి.