Telangana BJP: బీజేపీలో అంతర్గత కలహాలు ఆ పార్టీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ మూడేళ్లు కష్టపడి తెచ్చిన హైప్‌ను తాజాగా పార్టీ నేతలు మీడియా ముఖంగా చేస్తున్న వ్యాఖ్యలు దెబ్బతీస్తున్నాయి. ఒకానొక దశలో అధికార బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం అనుకున్న బీజేపీ ఇప్పుడు ఉనికి ని కాపాడుకోవడమే కష్టంగా మారుతోంది. సొంత నాయకులే పార్టీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేయడంతో వేగంగా ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతోంది. ప్రస్తుతం నేతల మాటలు చూస్తుంటే కాంగ్రెస్ తీరును గుర్తుచేస్తోంది. మొక్క నుంచి మహా వృక్షంగా ఎదిగిన బీజేపీ ఇమేజ్‌ను అత్మప్రబోధ వ్యాఖ్యలు, అతర్గతో పోరుతో ఆ పార్టీ నాయకులే నరికి వేస్తున్నారు.
గెలవలేమన్న నితిన్ గడ్కరీ..
కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో పార్టీ పరిస్థితికి అద్దం పట్టాయి. కేంద్రంతో అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణలో అధికారంలోకి రాలేమని పేర్కొన్నారు. కాకాపతే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటామని వెల్లడించారు.
అభ్యర్థులే లేరన్న మురళీధర్‌రావు..
ఇక బీజేపీ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ప్రాంత నేత అయితే ఇటీవల ఆంధ్రజ్యోతితో తెలంగాణతో తమకు అభ్యర్థులే లేరని చెప్పిటన్లు కథనం వచ్చింది. పట్టుమని 40 మంది కూడా లేని పార్టీ ఎలా గెలుస్తుంది అన్నట్లు మాట్లాడారు. ఈ కథనం పబ్లిష్ అయిన తర్వాత కూడా మురళీధర్‌రావు ఖండించలేదు.
చేరికలు కష్టమే అన్న ఈటల రాజేందర్..
ఇక బీజేపీలో చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న ఈటల రాజేందర్ అయితే పార్టీలో చేరికలు ఉండకపోవచ్చని చేతులు ఎత్తేశారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచే సీన్ లేదని పరోక్షంగా చెప్పారు. పొంగులేటి, జూపల్లితో చర్చల అనంతరం తనకే వారు రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్నారని వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శనం.
రఘునందన్ అసంతృప్తి..
ఇక దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అయితే తనను పార్టీ పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించారు. తన గెలుపుతోనే పార్టీ పుంజుకుందని, అయినా అధిష్టానం తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్న అధిష్టానం, తనతో మాత్రం మాట్లాడడం లేదని పేర్కొన్నారు. ఇటీవల టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇవే వ్యాఖ్యలు చేశాడు. తన వ్యాఖ్యలను కూడా ఖండించలేదు.
బండి సంజయ్‌పైనే అరవింద్ విమర్శలు..
ఇక నిజామాబాద్ ఎంపీ అయితే ఏకంగా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌నే విమర్శించారు. కవితను ఉద్దేశించి బండి చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఇదే క్రమంలో అధ్యక్ష పదవి మోనార్క్ కాదని కేవలం సమన్వక కర్త మాత్రమే అని వ్యాఖ్యానించారు.
సంజయ్‌పై సోషల్ మీడియాలో పోస్టు..
ఇక జాతీయ నాయకుడు, ఆర్‌ఎస్‌ఎస్ లీడర్ పేరాల శేఖర్ అయితే బండి సంజయ్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద పోస్టు పెట్టారు. సంజయ్‌ను తప్పించాలని కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
కోమటిరెడ్డి, కొడా విశ్వేశ్వర్‌రెడ్డి..
ఇక మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అయితే జాతీయ నాయకత్వం తీరును తప్పు పట్టారు. అధికారంలో ఉండి కూడా కవితను లిక్కర్ స్కాంలో అరెస్ట్ చేయకపోవడం ద్వారా తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అన్న బావన ఏర్పడుతోందని పేర్కొన్నారు.
ఇలా నేతలు ఆత్మప్రబోధ పేరుతో చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీ గ్రాఫ్‌ను వేగంగా పడగొడుతున్నారు. దీంతో బీజేపీని ఓడించేందుకు వేరే వాళ్లు అవసరం లేదు.. సొంత పార్టీ నేతలు చాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.