Indian Navy INS Androth: భారత్ తన సముద్ర సరిహద్దులను మరింత బలోపేతం చేసుకునేందుకు మరో మైలురాయిని స్థాపించింది. ఏఆర్‌ఎస్‌ఈ (గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్) నుంచి భారత నేవీకు అందించబడిన ఐఎన్‌ఎస్ అండ్రోత్, యాంటీ–సబ్‌మెరైన్ వార్‌ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ (ఏఎస్‌డబ్ల్యూఎస్‌డబ్ల్యూసీ) రెండో యూనిట్. దీనిని మూడేళ్లలోనే నిర్మించారు. ఇందులో 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ప్రపంచం దృష్టి మనపై పడకుండా సైలెంట్‌గా ఆండ్రోత్‌ను నేవీకి అప్పగించింది కేంద్రం.
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో తయారీ..
ఐఎన్‌ఎస్ అండ్రోత్, లక్షద్వీప్‌లోని అండ్రోత్ ద్వీపు పేరును పొందిన ఈ క్రాఫ్ట్, షాలో వాటర్‌లో (సముద్రపు అడుగు ప్రాంతాల్లో) శత్రు సబ్‌మెరైన్‌లను గుర్తించి, ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా రూపొందించబడింది. దీని పొడవు సుమారు 77 మీటర్లు, వెడల్పు 10.5 మీటర్లు, డ్రాఫ్ట్ కేవలం 2.7 మీటర్లు మాత్రమే – ఇది షాలో జోన్‌లలో సులభంగా ప్రయాణించడానికి అనుకూలం. డీజిల్ ఇంజిన్–వాటర్‌జెట్ ప్రొపల్షన్ వ్యవస్థతో, ఇది 25 నాటికల్ మైళ్ల వేగానికి చేరుకోగలదు. ఈ క్రాఫ్ట్, 2023 మార్చిలో లాంచ్ చేయబడి, 2025 సెప్టెంబర్ 13న భారత నేవీకు అందజేయబడింది. మూడు వారాల్లోనే ఇది నేవీకి చేరిన మూడో యూనిట్.
80% భారతీయ సాంకేతికత..
భారత్‌లోనే 80% పైగా కంటెంట్‌తో తయారైన ఐఎన్‌ఎస్ అండ్రోత్, ’ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమానికి ప్రతీక. 2013లో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ఆమోదించిన 16 ఏఎస్‌డబ్ల్యూఎస్‌డబ్ల్యూసీ ప్రాజెక్ట్‌లో భాగంగా, ఇది కే,13,440 కోట్ల బడ్జెట్‌తో జీఆర్‌ఎస్‌ఈ, కోచిన్ షిప్‌యార్డ్ (సీఎస్‌ఎల్) చేత నిర్మించబడుతోంది. మూడు–నాలుగేళ్లలో పూర్తయిన ఈ నిర్మాణం, భారతీయ ఇంజినీరింగ్‌లోని పురోగతిని చూపిస్తుంది – ఇందులో డీఆర్డీవో ఐఏసీఎంవోడీ ఈ కాంబట్ సూట్, ఇండిజినస్ రాకెట్లు సోనార్ సిస్టమ్స్ కీలకం. ఈ ప్రాజెక్ట్, పాకిస్తాన్ చైనా నుంచి∙పొందిన సబ్‌మెరైన్‌లను ఎదుర్కొనేందుకు రూపొందించబడింది. భారత్‌లోని 63 సంవత్సరాల జీఆర్‌ఎస్‌ఈ–నేవీ భాగస్వామ్యంతో, 70+ వార్‌షిప్‌లు డెలివరీ అయ్యాయి. ఇది ఇప్పుడు ఫ్రిగెట్‌లు, కొర్వెట్‌ల వైపు విస్తరిస్తోంది. ఇటువంటి అభివృద్ధి, ఆర్భాటం లేకుండా సాగడం, భారత్‌లోని డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తోంది.
హిందూ మహా సముద్రంలో భద్రతా కవచం..
భారత మహాసముద్ర ప్రాంతంలో చైనా, పాకిస్తాన్ సబ్‌మెరైన్ బెదిరింపులు పెరుగుతున్న నేపథ్యంలో, ఐఎన్‌ఎస్ అండ్రోత్ కీలకం. ఇవి కోస్టల్ సర్వెయిలెన్స్, లో–ఇంటెన్సిటీ మెరైటైమ్ ఆపరేషన్లు, మైన్‌లేయింగ్‌కు అనుకూలం. షాలో వాటర్‌లో సబ్‌మెరైన్ డిటెక్షన్ రేంజ్ 100–150 ఎన్‌ఎంకు చేరడం, భారత్‌లోని 7,500 కి.మీ. కోస్ట్‌లైన్‌ను రక్షించడానికి సహాయపడుతుంది.