https://oktelugu.com/

AP-Telangana: అమూల్ కథ: ఏపీలో ఇన్ ఫుట్.. తెలంగాణలో అవుట్ ఫుట్..

AP-Telangana: అమూల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో మంచి ఫామ్ లో కొనసాగుతోంది. పాల ఉత్పత్తిలో నూతన విప్లవం తీసుకొస్తోంది. ఏపీ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ పాల వెల్లువ పెంచుతోంది. దీంతో అమూల్ సంస్థకు ప్రభుత్వ ప్రోత్సాహం పెరుగుతోంది. దీంతో వ్యాపారం కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అమూల్ సంస్థ రాష్ర్టంలో పాల ఉత్పత్తిలో రోజురోజుకు భారీ మార్పులు తీసుకొస్తోంది. ప్రభుత్వం కూడా దన్నుగా నిలవడంతో అమూల్ సంస్థ వ్యాపారాభివృద్ధి […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 1, 2022 11:54 am
    Follow us on

    AP-Telangana: అమూల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో మంచి ఫామ్ లో కొనసాగుతోంది. పాల ఉత్పత్తిలో నూతన విప్లవం తీసుకొస్తోంది. ఏపీ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ పాల వెల్లువ పెంచుతోంది. దీంతో అమూల్ సంస్థకు ప్రభుత్వ ప్రోత్సాహం పెరుగుతోంది. దీంతో వ్యాపారం కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అమూల్ సంస్థ రాష్ర్టంలో పాల ఉత్పత్తిలో రోజురోజుకు భారీ మార్పులు తీసుకొస్తోంది. ప్రభుత్వం కూడా దన్నుగా నిలవడంతో అమూల్ సంస్థ వ్యాపారాభివృద్ధి చెందుతోంది.

    AP-Telangana

    AP-Telangana

    అయితే అమూల్ సంస్థ మాత్రం తన పెట్టుబడులను తెలంగాణలో పెట్టాలని భావిస్తోంది. ఇందుకు గాను రూ. 500 క ోట్లతో ప్లాంట్ నెలకొల్పాలని నిర్ణయించుకుంది. దీంతో ఏపీ ప్రజల్లో ఆందోళన నెలకొంది. వ్యాపారం ఇక్కడ పెట్టుబడులేమో తెలంగాణకా అనే ఆగ్రహం వారిలో వస్తోంది. గుజరాత్ కు చెందిన సంస్థ ఆంధ్రలో మార్కెటింగ్ చేస్తూ తెలంగాణలో పరిశ్రమ పెట్టాలని ఆలోచించడంతో ఆంధ్రా వాసుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. కనీసం ఇక్కడ డబ్బులు సంపాదించినప్పుడు ఫ్యాక్టరీ కూడా ఇక్కడే పెట్టవచ్చు కదా అని అందరు ఆశిస్తున్నారు.

    Also Read: 2021 రౌండప్: జగన్.. ఈ ఏడాది మాట తప్పా.. మడమ తిప్పాడు.. విసిగించాడు

    కానీ సంస్థ యాజమాన్యం మాత్రం తెలంగాణలో పెరుగు, స్వీట్లు, బేకరీ ఫుడ్స్ కోసం పరిశ్రమ స్థాపించాలని తెలంగాణ మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఆంధ్రలో అమూల్ సంస్థకు ప్రభుత్వమే అన్ని సహకారాలు అందజేసింది. పాలు కొనుగోలు చేసేలా మార్గనిర్దేశం చేసింది. దీంతో పాలు పోసే బాధ్యతను తన మీద పెట్టుకుని సంస్థకు లాభమే చేకూర్చింది.

    తెలంగాణలో పాల సేకరణ లేకున్నా పెట్టుబడులు పెట్టాలని చూస్తోంది. తెలంగాణ ప్రభుత్వం పైసా కూడా సాయం చేయకున్నా అక్కడ పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధపడింది. దీంతో ఏపీలో సేకరించిన పాలతోనే తెలంగాణలో ప్లాంట్ నెలకొల్పాలని అమూల్ సంస్థ భావించడం ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది. ఏపీలో సంపాదన చేస్తూ తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

    Also Read: కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేనా?

    Tags