Agriculture: కొవిడ్ మహమ్మారి వలన భారత్‌తో పాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ బాగా నష్టపోయాయి. ఇప్పుడిప్పడే గాడిలో పడుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థను ఇంకా బలోపేతం చేసేందుకుగాను ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే భారత పారిశ్రామిక రంగంలో అక్టోబర్ నెలలో వృద్ధి రేటు స్వలంగా పెరిగినట్లు నిపుణులు చెప్తున్నారు. పారిశ్రామిక ఉత్పత్తి సూచి 3.2 శాతం పెరిగినట్లు గణాంకాల ద్వారా తెలిసింది.

గతేడాది అక్టోబర్ నెలతో పోలిస్తే ఈ సారి పెరుగుదల కనిపించిందని అంటున్నారు. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ పాయింట్స్ క్రమంగా పెరిగిందన్న విషయం స్పష్టమవుతున్నది. జాతీయ గణాంకాల ఆఫీసుల రిలీజ్ చేసిన గణాంకాల ప్రకారం.. ఈ వివరాలు బయటకు వచ్చాయి. ఆ ప్రకారంగా.. తయారీ రంగంలో మెరుగైన పర్ఫార్మెన్స్ ఉన్నట్లు స్పష్టమవుతున్నది. గనులు, విద్యుత్ ఉత్పత్తి శాతం క్రమంగా పెరిగాయి.
Also Read: పూజకు ఉపయోగించే ఈ పుష్పాలను పొరపాటున కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకోకూడదు.. ఎందుకో తెలుసా?
గ్రామీణ రంగంలోనూ ఆదాయం పెరిగింది. అక్టోబర్ నెలలో దసరా, దీపావళి పండుగ సీజన్స్ ప్రభావం వలన కొనుగోళ్లు బాగా జరిగాయి. వస్తు సామగ్రి కొనుగోలు సామర్థ్యం పెరుగుదల వలన ఆర్థిక వ్యవస్థ చక్కగా గాడిన పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే, కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ వల్ల కొన్ని ప్రొడక్ట్స్ మేకింగ్‌లోనే ఇబ్బందులు పడ్డాయి. కాగా, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. క్రమంగా ఒక దాని తర్వాత మరొకటి గూడ్స్ మేకింగ్ అవుతుండగా, అవి మార్కెట్‌లోకి వచ్చిన వెనువెంటనే సేల్స్ కూడా జరిగిపోతున్నాయి.
దేశ ఆర్థిక రంగానికి ప్రస్తుతం వ్యవసాయం బాగా ఊతమిస్తున్నది. ప్రభుత్వాలు బియ్యం సేకరించడం వలన రైతులు లబ్ధి పొందుతున్నారు. మొత్తంగా పలు అంశాల్లో సూచీలు పెరుగుతుండటంతో దేశ ఆర్థిక పురోగతి కూడా కొలమానాల్లో కనబడుతున్నది. అక్టోబర్, నవంబర్ నెలల్లో కరోనా ముందునాటి పరిస్థితులు ఉన్నాయి. కానీ, తాజగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వెలుగులోకి రావడంతో మళ్లీ కొంత ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఒమిక్రాన్ ఆర్థిక ప్రగతిని అడ్డుకునేందుకు వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దేశ ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లోనూ వృద్ధి కనబడుతోం
Also Read: కర్పూరం పూజకు మాత్రమే కాదు ఆరోగ్యానికి ఎంత ఉపయోగమో తెలుసా?