https://oktelugu.com/

Indore Lover Murder: ప్రియుడి చేతిలో బలైన ప్రియురాలు

అక్రమ సంబంధాల ప్రభావంతో ప్రాణాలు పోతున్న సంఘటనలు అనేకం. రోజుకో హత్య జరుగుతూనే ఉంది. పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతూనే ఉంది. వివాహం చేసుకున్న మహిళ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తరువాత ప్రియురాలికి మూడో ప్రియుడు ఉన్నాడని ఆమె రెండో ప్రియుడుకి తెలిసి ఆమెను పక్కా ప్లాన్ తో చంపేశాడు. కానీ చివరికి శవమై కనిపించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని షాక్ కు గురయ్యారు. పోలీసులు అయోమయంలో పడిపోయారు. మహిళ జట్టు ఒక […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 16, 2021 / 05:45 PM IST
    Follow us on

    అక్రమ సంబంధాల ప్రభావంతో ప్రాణాలు పోతున్న సంఘటనలు అనేకం. రోజుకో హత్య జరుగుతూనే ఉంది. పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతూనే ఉంది. వివాహం చేసుకున్న మహిళ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తరువాత ప్రియురాలికి మూడో ప్రియుడు ఉన్నాడని ఆమె రెండో ప్రియుడుకి తెలిసి ఆమెను పక్కా ప్లాన్ తో చంపేశాడు. కానీ చివరికి శవమై కనిపించింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని షాక్ కు గురయ్యారు. పోలీసులు అయోమయంలో పడిపోయారు. మహిళ జట్టు ఒక చోట మృతదేహం మరో చోట పడిపోవడంతో విచారణ ఆలస్యమైంది.

    హత్యకు గురైంది ఎవరో ముందు గుర్తు పట్టడానికి వీలు పడలేదు. హతురాలి చేతిమీద ఉన్న పచ్చబొట్టు ఆధారంగా ఆమె సీమ అని నిర్ధారించారు. ఇండోర్ లోని సింగపూర్ టౌన్ షిప్ ఫేజ్ -1లో నివాసం ఉంటున్న ధన్ రాజ్ అనే యువకుడు మా సోదరి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ధన్ రాజ్ ఇంటికి వెళ్లి సీమ గురించి వివరాలు ఆరా తీశారు. ఆమె సోదరుడు చెప్పిన వివరాలు తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

    సీమకు కొన్నేళ్ల క్రితమే కేశ్రీయన్ భిల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే ఆమె వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో నాలుగు సంవత్సరాల క్రితం భర్త కేశ్రీయన్ భిల్ కూ దూరంగా ఉంటున్న సీమ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అతడితో కలిసి ఉంటోంది. సీమ గురించి ఆరా తీస్తున్న సమయంలో పోలీసులకు జాతీయ రహదారి పక్కన శవమై కనిపించిన మృతదేహం గుర్తుకు వచ్చింది. దీంతో అది సీమదేనని నిర్ధారించారు.

    సీమ చెప్పులు ఒక చోట, దుస్తులు మరో చోట, అడవిలో గడ్డి మీద రక్తపు మరకలు కనిపించడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. హత్యకు గురైంది సీమ అని మొదట గుర్తించకపోయినా తరువాత ఆధారాలు చూసిన వారికి సీమ అనే విషయం అర్థమైంది. సీమ చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా సీమ అని నిర్ధారించారు. ఇండోర్ లో శిఖండి ప్రాంతంలో నివాసం ఉంటున్న సురేష్ (41)తో అక్రమ సంబంధం పెట్టుకుంది. సీమ నాలుగు సంవత్సరాల నుంచి సురేష్ తో కలిసి ఉంటోంది. పోలీసులు సురేష్ ను పట్టుకుని విచారించగా విషయం బయటకు వచ్చింది. తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. సీమ ఎవరో మూడో వ్యక్తితో కలిసి ఉండడంతో సురేష్ సీమను అంతమొందించాలని పక్కా ప్లాన్ తో చంపేశాడు.