https://oktelugu.com/

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి తండ్రి, కుమారుడు మృతిచెందారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రామాపురం సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలానికి చెందిన కొండెబోయిన కొండయ్య(35) ఆయన కుమారుడు శివనాగరాజు(14) ద్విచక్రవాహనంపై చందవరానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో నీళ్ల ట్యాంకురుతో వెళ్తున్న ట్రాక్టరును ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఇద్దరూ ట్రాక్టరు టైరు కింద పడి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 21, 2021 / 12:39 PM IST
    Follow us on

    ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి తండ్రి, కుమారుడు మృతిచెందారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా దొనకొండ మండలం రామాపురం సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలానికి చెందిన కొండెబోయిన కొండయ్య(35) ఆయన కుమారుడు శివనాగరాజు(14) ద్విచక్రవాహనంపై చందవరానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో నీళ్ల ట్యాంకురుతో వెళ్తున్న ట్రాక్టరును ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఇద్దరూ ట్రాక్టరు టైరు కింద పడి అక్కడికక్కడే మృతిచెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.