Indian Railway: దూర ప్రయాణాలు చేయాలంటే దేశంలో ఎక్కువ శాతం మంది రైలు ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తారు. రైళ్లలో ప్రయాణాలు చేయడం వల్ల సురక్షితంగా ఉండటంతో పాటు తక్కువ ఖర్చుతో కూడుకున్నది. పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా రైలు ప్రయాణాలు చేస్తుంటారు. అయితే ఎక్కడికైనా వెళ్లాలంటే ఒక నెల లేదా రెండు నెలల ముందే టికెట్ బుక్ చేసుకోవాలి. లేకపోతే అసలు టికెట్లు దొరకవు. వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ఎంతో కష్టపడి రైలు ప్రయాణానికి టికెట్ బుక్ చేసుకున్న కూడా కొన్నిసార్లు ట్రైన్ ఆలస్యం రావడం జరుగుతుంది. గంట లేదా రెండు గంటలు ఆలస్యం అయితే పర్లేదు. కానీ కొన్నిసార్లు ఎక్కువ సమయం ఆలస్యంగా వస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది.
మన దేశంలో సాధారణంగా అన్ని రైళ్లు కూడా ఆలస్యంగానే నడుస్తుంటాయి. దీంతో ప్రయాణికులు రైల్వే స్టేషన్లలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. వీరికి అసౌకర్యం కలిగించకూడదని ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రైలు ఆలస్యం అయితే ప్రయాణికుల కోసం ఓ ఆఫర్‌ను తీసుకొచ్చింది. రైలు రావాల్సిన సమయం కంటే రెండు గంటలు లేదా అంత కంటే ఎక్కువ సమయం ఆలస్యంగా వస్తే ఐఆర్‌సీటీసీ క్యాటరింగ్ పాలసీ ప్రకారం ఉచిత భోజనాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. సమయాన్ని బట్టి ఫుడ్ ఇస్తారు. మీరు ఉదయం సమయాల్లో రైలు ఆలస్యం వల్ల ఉంటే టిఫిన్ ఇస్తారు. అదే మధ్యాహ్నం అయితే భోజనం, సాయంత్రం అయితే టీ, కాఫీ, బిస్కెట్లు, డ్రింక్ వంటివి ఇస్తారు. ప్రయాణికులు రిక్వెర్‌మెంట్ బట్టి ఐఆర్‌సీటీసీ ప్రయాణికులకు ఈ సదుపాయాన్ని అందజేస్తుంది. అయితే ఈ భోజనం సౌకర్యం అనేది రాజధాని, శతాబ్ది, దురంతో వంటి రైలు ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది.
రైలు రెండు నుంచి మూడు గంటల వరకు ఆలస్యంగా వస్తే ఉచిత భోజనం ఇస్తారు. అదే ఎక్కువ గంటలు రైలు ఆలస్యంగా వస్తే టికెట్ పూర్తి ఛార్జీలను రిఫండ్ చేస్తారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి వెంటనే క్యాన్సల్ చేసి వారి డబ్బును రిఫండ్ చేస్తారు. అదే రైల్వే స్టేషన్ కౌంటర్లలో బుక్ చేసుకున్న వారు స్టేషన్‌లో ఉన్న కౌంటర్ దగ్గరకు వెళ్లి క్యాన్సల్ చేసుకోవాలి. అప్పుడే డబ్బులు ఇస్తారు. లేకపోతే రైలు వచ్చేంత వరకు వెయిట్ చేసి అదే ట్రైన్ ఎక్కాలి. ఎక్కువ గంటలు రైలు ఆలస్యం అయితే స్టేషన్‌లో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా రాజధాని వంటి రైళ్లు ఆలస్యంగా నడవు. ఎక్స్‌ప్రెస్‌లు, ప్యాసెంజర్లు వంటివి మాత్రమే ఎక్కువగా ఆలస్యంగా నడుస్తుంటాయి. కానీ వీటికి ఈ రూల్స్ వర్తించవని రైల్వే శాఖ తెలిపింది.