Homeజాతీయ వార్తలుIndian Railway Viral Video: కొత్త ట్రెండ్: రైలు బాత్రూంలే ఓయో రూం లు.. జంటల...

Indian Railway Viral Video: కొత్త ట్రెండ్: రైలు బాత్రూంలే ఓయో రూం లు.. జంటల కొత్త కాన్సెప్ట్

Indian Railway Viral Video: రైళ్లు ఇంతకాలం రీల్స్‌ చేయడానికే వాడుతున్నారనుకున్నాం. ముఖ్యంగా మెట్రో, ఎంఎంటీఎస్, లోకల్‌ రైళ్లలో యువతీయువకులు రీల్స్‌ చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. లైక్స్, వ్యూస్‌ కోసం యువత ఇలా చేస్తోంది. రైల్వే శాఖ కట్టడికి చర్యలు చేపట్టడంతో కాస్త తగ్గినా.. ఇప్పటికీ అక్కడక్కడ జరుగుతున్నాయి. ప్రయాణికులకు ఇబ్బంది కరంగా మారుతున్నాయి. తాజాగా బాత్‌రూంలలో అసాంఘి కార్యాకలాపాలూ మొదలెట్టేశారు. ఒకప్పుడు టికెట తీసుకోనివారు టీటీ వచ్చే సమయంలో బాత్‌రూంలలో దాక్కునేవారు. కానీ ఇప్పుడు యువతీ యువలకులు తమ కోరికలు తీర్చుకునేందుకు వాడుతున్నారు. తాజాగా ఓ రైళ్లో ఒకే బాత్‌రూంలో యువతీ యువకులు ఉన్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన చర్చనీయాంశమైంది.

వీడియో వైరల్‌..
ఒకే బాత్‌రూం నుంచి మొదట యువతి, తర్వాత యువకుడు బయటకు వస్తున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు, రైలు ప్రయాణికులు విభిన్న రీతుల్లో స్పందించారు. కొందరు ఈ జంట దంపతులు కావచ్చని, వారి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని వాదించగా, మరికొందరు బహిరంగ ప్రదేశమైన రైలు బాత్‌రూంను ఇలాంటి కార్యకలాపాలకు ఉపయోగించడం సమాజ విలువలకు వ్యతిరేకమని మండిపడ్డారు. ‘‘వేరే ప్రదేశం దొరకలేదా?’’ అని కొందరు ప్రశ్నిస్తుండగా, ‘‘ఇలాంటి చర్యలు ప్రయాణికుల భద్రత, గౌరవాన్ని దెబ్బతీస్తాయి’’ అని ఇతరులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటన రైలు ప్రయాణాల్లో నైతికత, గోప్యత అంశాలను ప్రశ్నార్థకం చేసింది.

Also Read: ఓట్ల చోరీ :ఈసీ కౌంటర్ సరిపోలేదు.. ప్రతిపక్షాల ప్రశ్నలకు జవాబేది?

రైల్వే అధికారులపై చర్యల డిమాండ్‌..
వీడియో వైరల్‌ కావడంతో, నెటిజన్లు రైల్వే అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. రైళ్లలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించేందుకు కఠిన నిబంధనలు, కెమెరా నిఘా, రైల్వే సిబ్బంది జాగ్రత్తలను పెంచాలని సూచిస్తున్నారు. ‘‘ఇలాంటి ఘటనలు జరగకుండా చూడటం రైల్వే శాఖ బాధ్యత’’ అని చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో, కొందరు ఈ వీడియోలను రహస్యంగా చిత్రీకరించడం గోప్యతకు భంగం కలిగించే చర్యగా భావిస్తున్నారు, ఇది మరో నైతిక చర్చకు దారితీసింది. ఈ ఘటన సోషల్‌ మీడియా యుగంలో బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తిగత ప్రవర్తన, గోప్యత మధ్య సమతుల్యత గురించి కీలక చర్చను రేకెత్తించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular