Case filed against Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు( deputy CM Pawan Kalyan) షాక్ తగిలింది. అనూహ్యంగా హైకోర్టు ఆయనపై దాఖలైన కేసును విచారణకు స్వీకరించింది. కొద్ది రోజుల కిందట హరిహర వీరమల్లు సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ప్రమోషన్ కోసం మంత్రిగా ఉంటూ ప్రభుత్వ నిధులను వాడుకున్న వ్యవహారంలో సిబిఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయింది. అందులో సిబిఐ, ఏసీబీ న్యాయవాదులను ప్రతివాదులుగా చేర్చాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం విశేషం. అయితే ప్రాథమిక విచారణకు ముందే వారికి నోటీసులు ఇవ్వాలని పిటిషనర్ చేసిన విజ్ఞప్తిని మాత్రం హైకోర్టు తోసి పుచ్చింది. మొన్న ఆ మధ్యన హరిహర వీరమల్లు సినిమా విడుదలైంది. అప్పట్లోనే ఆ సినిమా టికెట్ల ధర పెంపు పై రకరకాల విమర్శలు వచ్చాయి. మంత్రిగా ఉంటూ ప్రభుత్వ నిధులతో ప్రమోషన్ చేసుకోవడం ఏంటనే ప్రశ్నా వినిపించింది. ఈ నేపథ్యంలో మాజీ ఐఏఎస్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అధికార దుర్వినియోగం..
ఏపీ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పదవి చేపడుతున్నారు. అందుకే ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ తన హరిహర వీరమల్లు( Harihara Veera Mallu ) సినిమాను ప్రమోట్ చేసుకోవడం, కలెక్షన్లు కోసం సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై దృష్టి పెట్టారని ఆరోపిస్తూ విజయకుమార్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ధరల పెంపునకు సంబంధించిన ఫైలును ఆయనే ప్రాసెస్ చేసినట్లు పవనే చెప్పుకుంటున్నారని.. సొంత సినిమా కావడంతో సొంత శాఖ కాకపోయినా ఫైలును ప్రాసెస్ చేయడం అనేది అధికార దుర్వినియోగం కిందకే వస్తుందని పిటిషన్ లో పేర్కొన్నారు. సినిమాలే తనకు జీవనోపాధి అంటున్న పవన్ కళ్యాణ్.. భారత ప్రభుత్వం ఇచ్చిన ప్రవర్తన నియమావళిని పట్టించుకోవడంలేదని.. మంత్రి పదవి చేపట్టే ముందు వ్యాపారాలు, ఇతర ఆదాయ మార్గాల్లో భాగస్వామ్యంగా ఉండకూడదు అనే నిబంధన పవన్ కళ్యాణ్ కు తెలియదా అంటూ ఆర్పిటిషన్లో ప్రశ్నించారు. కేవలం ఆదాయం కోసమే తాను సినిమాల్లో నటిస్తున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్.. తప్పును బహిరంగంగానే ఒప్పుకున్నారని కూడా ఆ పిటిషన్ లో పొందుపరిచారు.
Also Read: నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం.. హైదరాబాద్ కు చంద్రబాబు.. వరుసగా ఆ కుటుంబానికే ఎందుకిలా!
విచారణ వారం రోజులు పాటు వాయిదా..
అయితే కొద్ది రోజుల కిందట ఆ పిటిషన్ దాఖలు చేశారు విజయ్ కుమార్( Vijay Kumar). కానీ ఈరోజు విచారణకు రాగా.. హైకోర్టు స్వీకరించింది. జాబితాలో సిబిఐ, ఏసీబీ లాయర్ల పేర్లను కూడా చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ప్రభుత్వ నిధులతో హరిహర వీరమల్లు చిత్రం ప్రమోషన్ చేసుకోవడం.. తన సినిమాకు టికెట్ రేట్లు పెంచుకుంటూ ఆదేశాలు ఇచ్చుకున్నట్లు చెప్పుకోవడం వంటి అంశాలను ప్రస్తావించారు. దీనిపై సిబిఐ దర్యాప్తు చేయించాలని కూడా కోరారు. అయితే విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఈ కేసును మరో వారం రోజులు పాటు వాయిదా వేసింది. ఒక విధంగా ఈ పిటిషన్ కొట్టివేతకు గురవుతుందని అంతా భావించారు. కానీ కోర్టు అనూహ్యంగా విచారణకు స్వీకరించడం మాత్రం పవన్ కళ్యాణ్ కు షాకింగ్ పరిణామమే.