Homeఉద్యోగాలుIndian Navy SSC Recruitment 2026: ఇండియన్‌ నేవీలో కొలువులు.. రూ.1.20 లక్షల జీతం.. 275...

Indian Navy SSC Recruitment 2026: ఇండియన్‌ నేవీలో కొలువులు.. రూ.1.20 లక్షల జీతం.. 275 ఉద్యోగాలు!

Indian Navy SSC Recruitment 2026: దేశ సేవ చేయాలనుకునే వారికి కేంద్రం ఏటా సైన్యంలో నియామకాలు చేపడుతోంది. ఆర్మీ, బీఎస్‌ఎస్, సీఆర్‌పీఎఫ్, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా నేవీలో డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇండియన్‌ నేవీ షార్ట్‌ సర్వీసెస్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) విధానం ద్వారా వివిధ బ్రాంచీలలో సుమారు 275 పోస్టులను భర్తీ చేయనుంది. యూజీ/పీజీ డిగ్రీ పూర్తి చేసిన యువతీయువకులకు ఈ అవకాశం లభిస్తోంది. డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రారంభ ఎంపిక ఉంటంది. అర్హులైన వారిని శిక్షణకు పిలుస్తారు.

రిక్రూట్‌మెంట్‌ కీలక అంశాలు
ఇండియన్‌ నేవీలో ఎగ్జిక్యూటివ్, టెక్నికల్, ఎడ్యుకేషన్, లాజిస్టిక్స్‌ వంటి వివిధ ఎంట్రీలలో ఈ పోస్టులు ఉన్నాయి. ఎస్‌ఎస్‌సీ విధానం కాబట్టి, నిర్ణీత కాలంపాటు సేవ చేసిన తర్వాత పర్మనెంట్‌ కమిషన్‌ అవకాశాలు కూడా ఉండవచ్చు. ఇది యువతకు రక్షణ రంగంలో అధికారి స్థాయిలో నేరుగా ప్రవేశించే మంచి మార్గం.

అర్హతలు, ఎంపిక విధానం..
యూజీ లేదా పీజీ డిగ్రీ పూర్తి చేసిన యువతీయువకులు అర్హులు. డిగ్రీలో మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్‌ జరుగుతుంది. తర్వాత ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టులు వంటి దశలు ఉంటాయి. ఈ విధానం వల్ల అకడమిక్‌ పెర్ఫార్మెన్స్‌ బాగా ఉన్న వారికి మంచి అవకాశం లభిస్తుంది. మహిళలకు కూడా సమాన అవకాశాలు ఉన్నాయి.

శిక్షణ, ఉద్యోగ వివరాలు..
ఎంపికైన అభ్యర్థులకు 2027 నుంచి కేరళలోని ఎజిమల ఇండియన్‌ నేవల్‌ అకాడమీలో శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత సబ్‌ లెఫ్టినెంట్‌ హోదాతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. ప్రారంభ జీతం రూ.1.20 లక్షలు(భత్యాలతో సహా) వరకు ఉంటుంది. దీంతోపాటు వైద్య సౌకర్యాలు, హౌసింగ్, ట్రావెల్‌ అలవెన్సులు, రిటైర్మెంట్‌ ప్రయోజనాలు వంటి అనేక సౌకర్యాలు లభిస్తాయి.

దరఖాస్తు విధానం..
ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
జూలై 27, 2026 వరకు తుది గడువు.
పూర్తి వివరాలు, బ్రాంచీల వారీగా అర్హతలు, కచ్చితమైన వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://www.joinindiannavy.gov.in ను సందర్శించండి.

మంచి జీతం, జాబ్‌ సెక్యూరిటీ, హెల్త్‌ బెనిఫిట్స్, పెన్షన్‌ వంటి ప్రయోజనాలు ఉండటం వల్ల ఇది గ్రాడ్యుయేట్లకు ఆకర్షణీయంగా ఉంది. డిగ్రీ మార్కులు ముఖ్యమైనవి కాబట్టి, మంచి అకడమిక్‌ రికార్డ్‌ ఉన్న వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version