India-US Relations: భారత్ – అమెరికాల మధ్య బంధం బలపడుతోంది. ఇటీవల జరిగిన పరిణామాలతో చాలామంది సంబంధాలు బలహీనపడుతున్నాయని అనుకుంటున్నారు. కారణం.. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధాన్ని ఇండియా ఖండించలేదు. అమెరికా కోరినప్పటికీ ఇండియా శాంతియుతంగా ఉండాలని సూచించిందికానీ రష్యా సైనిక చర్యను వ్యతిరేకించలేదు. అలాగే అమెరికా అధికారులు ఇటీవల తైవాన్‌లో పర్యటించారు. ఈ సమయంలో ఇండియా అటు చైనాకుగానీ, ఇటు అమెరికాకుగానీ అండగా నిలువలేదు. పైగా అమెరికా అధికారుల పర్యటనను సున్నితంగా తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో అమెరికాతో సంబంధాలు §ð బ్బతింటున్నాయన్న ప్రచారం జరిగింది. కానీ ఇండియా – అమెరికా మధ్య సైనిక సంబంధాలు బలపడుతున్నాయి.

విస్తరిస్తున్న వ్యూహాత్మక బంధం..
మన్‌మోహన్ హయం నుంచి నరేంద్ర మోదీ వరకు తీసుకున్న నిర్ణయాలు సైనికపరంగా సంబంధాలను పెంచుతున్నాయి. ఇటీవల కూడా మూడు పరిణామాలు జరిగాయి.
1. ఐటూ యూటూలో సభ్యత్వం.. ఇటీవల అమెరికా సారథ్యంలో ఏర్పడిన ఐ టూ, యూటూ కూటమి ఏర్పాటయింది. ఇందులో భారత్ సభ్యదేశమైంది. ఇందులో ఇజ్రాయిల్, అమెరికా, యూఏఈతో కలిపి పశ్చిమాశియాలో ఏర్పాటయింది. ఇండియా ఈ కూటమిలో లేకపోయినా ఇజ్రాయిల్, యూఏఈతో మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ అమెరికాకు కూటమి అవసరం. ఇజ్రాయిల్, యూఏఈతో సంబంధాలు పెంచుకోవడానికి, వ్యూహాత్మక ప్రయోజనాల కోసం దీనిని ఏర్పాటు చేసింది.
2. క్వాడలో భారత్ భాగస్వామి.. చైనాకు వ్యతిరేకంగా అమెరికా నాయకత్వంలో ఏర్పడిన ఇండో పస్పిక్ కూటమి క్వాడ్‌లో కూడా భార™Œ భాగస్వామి అయింది. ఇందులో ఆస్ట్రేలియా, జపాన, అమెరికా సభ్యదేశాలు ఉన్నాయి.
3. మారిటైన్ ఫోర్స్‌లో అసోసియేట్ మెంబర్.. ఇండియా ఇటీవల అమెరికా సారథ్యంలో బహ్రైన్ కేంద్రంగా ఏర్పాటు చేసిన మారిటైన్ ఫోర్సులో కూడా ఇండియా అసోసియేట్ మెంబర్‌గా చేరింది. ఇందులో 35 దేశాలు ఉన్నాయి. గతంలో ఎన్నడూ సైనిక ఫోర్సులో భారత్ సభ్యదేశం కాదు. కానీ ఇటీవల మారిటైన్ ఫోర్సులో చేరింది.

4. నేవీషిప్‌కు భారత్‌లోకి అనుమతి.. అమెరికాకు చెందిన నేవీ షిప్ ఇటీవల చెన్నైకి వచ్చింది. ఇంధనం నింపుకోవడానికి భారత్ అనుమతించింది. గతంలో మిలటరీ విమానాలు, షిప్‌లకు భారత్ ఎవరికీ అనుమతి ఇవ్వదు. కానీ మిలటీరీ షిప్‌కు అనుమతి ఇవ్విడం ఇదే ప్రథమం. మన్‌మోహన్‌సింగ్ హయాంలో చేసుకున్న లాజిస్టిక్ సప్లయ్ ఒప్పందాన్ని మోడీ బలంగా అమలు చేస్తున్నారు. దీని ప్రకారం అమెరికా నేవీ షిప్‌లు, ఎయిర్ ఫోర్స్ విమానాలకు అవసరమైన సదుపాయాలు అందించడం, ఇంధనం నింపుకోవడం, మరమ్మతులకు అనుమతి ఇచ్చింది. ఏ స్వతంత్ర దేశం కూడా యుద్ధ విమానాలు, షిప్‌లకు అనుమతి ఇవ్వవు. కానీ ఇండియా అమెరికాకు ఆ అవకాశం ఇవ్వడం వ్యూహాత్మక సంబంధాల కోసమే. ఈ పరిణామాల ప్రకారం భారత – అమెరికాల మధ్య వ్యూహాత్మక బంధాల బలోపేతాన్ని తెలియజేస్తున్నాయి.
Also Read:Amit Shah- Chandrababu: రామోజీరావు మాస్టర్ ప్లాన్.. నేడు అమిత్ షా, చంద్రబాబు భేటీ?

