Telangana Assembly Election 2023
India TV Opinion Poll : తెలంగాణ ఎన్నికల వేళ సర్వేల హోరు వినిపిస్తోంది. జాతీయ ప్రముఖ మీడియాలన్నీ కూడా తమ సర్వే ఫలితాలను వెల్లడిస్తున్నాయి. మెజార్టీ సర్వేల్లో ఈసారి తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ దే గెలుపు అని ఇస్తుండగా.. కొన్ని విశ్వసనీయత గల జాతీయ మీడియాల్లో విభిన్నమైన ఫలితం వస్తోంది. ఇప్పుడు ఈ సర్వేలతో తెలంగాణ ప్రజానీకంలోనూ గందరగోళం నెలకొంది.
ఏబీపీ సీ ఓటర్ సంస్థ తాజాగా ఓపినియన్ పోల్ 2023 విడుదల చేసింది. ఈ పోల్ ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్ గణనీయంగా పుంజుకుంది. గత ఎన్నికలలో కాంగ్రెస్ కు 19 స్థానాలు రాగా.. ప్రస్తుత అంచనా ప్రకారం కాంగ్రెస్ 43 నుంచి 55 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. ఇక అధికార బీఆర్ఎస్ భారీగా నష్టపోతుందని సర్వే తేల్చింది. 49 నుంచి 61 స్థానాలను గెలుచుకోవచ్చని అంచనా వేసింది.
ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ విడుదల చేసింది. ఇందులో ఆశ్చర్యకరంగా మరోసారి బీఆర్ఎస్ దే అధికారం అని క్లియర్ కట్ గా చెప్పుకొచ్చింది. బీఆర్ఎస్ – 72 సీట్లు, కాంగ్రెస్ – 33 సీట్లు, బీజేపీ – 6 సీట్లు
ఏంఐఎం – 7 సీట్లు, ఇతరులు – 1 సీటు గెలుస్తారని పేర్కొంది.
ఈ రెండు సర్వేలను బట్టి చూస్తే తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ దే విజయం అని తెలుస్తోంది. కానీ మునుపటి కంటే కేసీఆర్ పై వ్యతిరేకత పెరిగింది. దాన్ని క్యాష్ చేసుకుంటే మాత్రం కాంగ్రెస్ గెలవడం.. రేవంత్ రెడ్డి సీఎం కావడం ఖాయంగా తెలుస్తోంది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ విడుదల
బీఆర్ఎస్ – 72 సీట్లు
కాంగ్రెస్ – 33 సీట్లు
బీజేపీ – 6 సీట్లు
ఏంఐఎం – 7 సీట్లు
ఇతరులు – 1 సీటు#IndiaToday #TelanganaElections #TelanganaElection2023 pic.twitter.com/7NVNthvtHJ— Telugu Scribe (@TeluguScribe) November 4, 2023