India TV CNX Opinion Poll 2024: ఎన్నికలకు పట్టుమని పది నెలల సమయం కూడా లేదు. అన్ని పార్టీలు గెలుపు పై నమ్మకంగా ఉన్నాయి. ఈ తరుణంలో జాతీయ మీడియా చేపట్టిన ఒపీనియన్ పోల్ సర్వేలో షాకింగ్ ఫలితాలు వెల్లడయ్యాయి. పార్లమెంట్ స్థానాల ప్రాతిపదికగా తీసుకుని చేపట్టిన ఈ ఒపీనియన్ పోల్ లో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఇండియా టీవీ, సి ఎన్ ఎక్స్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ వెల్లడయింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఎన్ని లోక్ సభ స్థానాలు స్థానాలు లభిస్తాయని సదరు మీడియా సంస్థ ఒపీనియన్ పోల్ ను సేకరించింది. కేంద్రంలో ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణ కూటమి వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైంది. విపక్ష కూటమి ఇండియా గట్టి పోటీ ఇవ్వగలుగుతుందని అంచనా వేసింది.
ఏపీ విషయానికి వస్తే అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి తిరుగులేని విజయం సొంతం చేసుకుంటుందని ఒపీనియన్ పోల్ తేల్చి చెప్పింది. ఏపీలో 25 లోకసభ స్థానాలు గాను.. ఆ పార్టీ 18 చోట్ల విజయం సాధించనుంది. విపక్ష తెలుగుదేశం పార్టీ ఏడు స్థానాలకు పరిమితం కానుంది. లోక్ సభ స్థానాలను పరిగణలో తీసుకుంటే.. అధికార వైసిపి 126 అసెంబ్లీ స్థానాలు.. టిడిపి 49 అసెంబ్లీ స్థానాలు గెలుపొందే ఛాన్స్ ఉంది. అయితే జనసేన పార్టీని పరిగణలోకి తీసుకోకపోవడం విశేషం. బిజెపికి ఎనిమిది శాతం ఓటింగ్ లభిస్తుందని చెప్పడం కాస్త ఉపశమనం.
అయితే 46% ఓట్ షేరింగ్ తో వైసిపి ముందంజలో ఉంది. టిడిపి 36% ఓటింగ్ సాధిస్తుందని స్పష్టం చేసింది. బిజెపి ఎనిమిది శాతంతో తర్వాత స్థానంలో ఉంది. అయితే జనసేన ను బిజెపి మిత్రపక్షంగా భావించినట్టుంది. అందుకే ఎక్కడా జనసేన పేరు ప్రస్తావించలేదు. అయితే ఈ ఫలితాలు టిడిపి శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. టిడిపి, బిజెపి, జనసేన మధ్య పొత్తు కుదిరితే తప్పకుండా కూటమి విజయం సాధిస్తుందని టిడిపి శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి.
ఇండియా టివి CNX ఒపీనియన్ పోల్ పోల్ లో తెలంగాణలో పరిస్థితులపై కూడా సర్వే చేశారు. తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ 8 ఎంపీ సీట్లు, బీజేపీ 6 సీట్లు, కాంగ్రెస్ 2 సీట్లు గెలుస్తుందని సర్వే తేల్చింది. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ మధ్యన అధికారం కోసం టఫ్ ఫైట్ నడుస్తుందని ఈ సర్వే తేల్చింది.