Homeజాతీయ వార్తలుIndia Today Survey: కేసీఆర్‌ను వణికించే వార్త.. కాంగ్రెస్‌కు ఊపు తెచ్చే వార్త..

India Today Survey: కేసీఆర్‌ను వణికించే వార్త.. కాంగ్రెస్‌కు ఊపు తెచ్చే వార్త..

India Today Survey: తెలంగాణ ఎన్నికల రేసులో అందరికంటే ముందు ఉండాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఇండియా టుడే షాక్‌ ఇచ్చింది. ఇప్పటికే 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి మంచి ఊపు మీద ఉన్న బీఆర్‌ఎస్‌కు ఇండియా టుడే మూడ్‌ ఆఫ్‌ తెలంగాణ సర్వే అంచనా ఆ ఉత్సాహాన్ని నీరుగార్చింది.

కాంగ్రెస్‌కు ఎడ్జ్‌..
తాజా సర్వేలో కాంగ్రెస్‌కు ఎడ్జ్‌ వచ్చినట్లు ఇండియా టుడే తెలిపింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలోని 19 లోక్‌సభ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ సీట్లు.. 9 నుంచి 6కు తగ్గుతాయని తెలిపింది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ స్థానాలు 3 నుంచి 8కి పెరుగుతాయని తేల్చింది. ఇక బీజేపీ సీట్లలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం ఉన్న నాలుగు లోక్‌సభ స్థానాలను నిలబెట్టుకుంటుందని వెల్లడించింది.

కాంగ్రెస్‌లో జోష్‌..
తాజా ఇండియా టుడే సర్వే ఫలితాలు కాంగ్రెస్‌లో ఉత్సాహం నింపుతాయనడంలో సందేహం లేదు. ఇదే సమయంలో తాము ముందు ఉన్నామని పిస్తున్న బీఆర్‌ఎస్‌కు నిరుత్సాహం తప్పదు. సంక్షేమ పథకాలు గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్న గులాబీ బాస్‌కు నిజంగా ఈ ఫలితాలు షాక్‌ అనే చెప్పాలి. ఇక బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అని, దక్షిణాది నుంచి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలని భావిస్తున్న బీజేపీకి కూడా తాజా ఫలితాలు ఇబ్బందికరమే. ఈ సర్వే చూస్తుంటే కర్ణాటక ఫలితాల ఇంపాక్ట్‌ తెలంగాణపై పడుతుందని ఇండియా టుడే అంచనా వేసింది. ఇది ఎన్నికల నాటికి ఇంకా పెరొగొచ్చని భావిస్తోంది.

అసెంబ్లీ ఎన్నిలు భిన్నం..
అయితే అసెంబ్లీ ఎన్నికలు పూర్తిగా స్థానిక అంశాలపై ఆధారపడి ఉంటాయి. సర్వే ఫలితాల ప్రభావం కచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల పై ఉంటుంది. కానీ పూర్తిగా మారిపోతాయని మాత్రం చెప్పలేం. తెలంగాణ ఎన్నికల నాటికి ప్రజల మూడ్‌ను మార్చేలా పార్టీలు ఇచ్చే హామీలు, అజెండా, అభ్యర్థులు కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతారని తెలుస్తోంది.

కేసీఆర్‌ ఎలా స్పందిస్తారో..
ఇక ఇండియా టుడే సర్వేపై బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, తెలంగాణ ముఖ్యమైన మంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి. తప్పులు సరిదిద్దుకుంటారా.. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తారో వేచి చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version