Bedurulanka 2012 Review: ‘ఆర్ఎక్స్ -100’ అనే ఫస్ట్ మూవీతోనే ఫేమస్ అయిన కార్తీకేయ.. హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన సినిమా బ్లాక్ బస్తర్ కాకపోయినా కథల ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నట్లు తెలుస్తోంది. మంచి కథలున్న సినిమాల్లో కార్తీకేయ నటించడం విశేషం. తాజాగా డిఫరెంట్ స్టోరీతో ‘బెదురులంక’ సినిమాలో నటించారు. ఈ మూవీ ఆగస్టు 25న థియేటర్లోకి వచ్చింది. ఈ మూవీ ఎలా చూద్దాం..
నటీనటులు:
కార్తీకేయ,
నేహాశెట్టి
అజయ్ ఘోష్
ఎల్బీ శ్రీరామ్
సురభి
ఆటో రాంప్రసాద్
కిట్టయ్య,
దివ్యనార్ని తదితరులు
సాంకేతిక కార్యవర్గం:
డైరెక్టర్ : క్లాక్స్
నిర్మాత : రవీంద్ర బెనర్జీ ముప్పానేని
సంగీతం : మణిశర్మ
ఎడిటింగ్ : విప్లవ్ న్యాసదం
సినిమాటోగ్రఫీ : సాయి ప్రకాశ్ ఉమ్మడి సింగు
కథ:
శివ (కార్తీకేయ) గ్రాఫిక్ డిజైనర్ గా సినిమాల్లో పనిచేస్తుంటాడు. ఈయనది బెదరులంక గ్రామం. కాస్త సూటిగా మాట్లాడేతత్వం ఉండడంతో అందరికీ శత్రువుగా మారుతాడు. అయితే తన ఊరు ప్రెసిడెంట్ (గోపరాజు రమణ) కూతురు చిత్ర (నేహ శెట్టి)ని ప్రేమిస్తాడు. ఇదిలా ఉండగా యుగాంతం ప్రారంభమవుతుందని ప్రచారం సాగుతుంది. దీంతో గ్రామంలో అలజడి మొదలవుతుంది. దీనిని ఆసరాగా తీసుకొని డేనియల్ (ఆటో రాంప్రసాద్), దిగంబర బ్రహ్మ (శ్రీకాంత్ అయ్యంగార్), భూషణం(అజయ్ ఘోష్)లు ఓ కుట్ర పన్నుతాడు. అయితే వీరి కుట్ర నుంచి శివ గ్రామ ప్రజలను ఎలా కాపాడుతాడు? అనేది సినిమా కథాంశం.
విశ్లేషణ:
2012లో యుగాంతం వస్తుందనే భయం ప్రచారం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి? అనే విషయాన్ని ఆధారంగా తీసుకొని ఈ సినిమా నడుస్తుంది. ఇందులో పూర్తిగా గోదావరి ప్రజల జీవనస్థితులను చూపించారు. పల్లెటూరి యాస, పచ్చదనాన్ని ఆహ్లదంగా చూపిస్తూనే వారి అమాయకత్వాన్ని ప్రదర్శించారు. డిఫరెంట్ కథతో ప్రేక్షకులకు మంచి అనుభూతి కలుగుతుంది. యుగాంతం కారణంగా మూఢనమ్మకాలు, దొంగబాబాలు చేసిన ఆగడాలను సినిమాటిక్ రూపంలో ప్రదర్శింపజేశారు.
మూవీ ఫస్టాఫ్ విషాయినికొస్తే హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్ , కామెడీ విపరీతంగా ఆకట్టుకుంటుంది. గోదావరి పల్లెల్లో ఉండే ఆహ్లాదకరమైన వాతావరణం ఆకట్టుకుంటుంది. ఎక్కడా పరిమితికి మించకుండా నేచురల్ గా చూపించారు.
సెకండాఫ్ లోకి వెళ్లగానే సీన్స్ మారిపోతాయి. ప్రజల్లో ఉండే భయాలు, వారిని కాపాడడానికి హీరో చేసే ప్రయత్నాల్లో భాగంగా హీరో యాక్షన్స్ కళ్లకు అద్దినట్లు కనిపిస్తాయి. మొత్తంగా కొత్త కథను ప్రేక్షకులకు అనుభూతిని కలిగించారు.
ఎవరెలా చేశారంటే:
హీరో కార్తీకే పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా.. అందులో ఇమిడిపోయే మనస్తత్వం అయనది. ఈ సినిమాలో కూడా తన తన ప్రతాపాన్ని చూపించాడు. కామెడీ, లవ్ యాంగిల్స్ తో పాటు యాక్షన్ సీన్స్ లో దేనికదే అన్నట్లు హీరో మారుతాడు. హీరోయిన్ నేహాశెట్టి ఎప్పటిలాగే అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ‘డీజె టిల్లు’ మూవీతో ఆకట్టుకున్న ఈ భామ ఇందులోనూ హాట్ హాట్ గా కనిపించింది. పచ్చని గోదావరి పల్లెల్లో పరువాల ప్రదర్నన అన్నట్లు ఆకట్టుకుంది. ఆటో ఆటో రాంప్రసాద్, అజయ్ ఘోష్, అయ్యంగార్, గోపరాజు రమణలో కామెడీతో అలరించారు.
సాంకేతికం ఎలా పనిచేసిందంటే?
డైరెక్టర్ క్లాక్స్ కొత్త కథను ఎంచుకుని ఆకట్టుకున్నారు. ఈ కథను ప్రదర్శించడంలోనూ ఆకట్టుకున్నారు. అయితే ఫస్టాప్ లో రొటీన్ సీన్స్ పెట్టడంతో కాస్త బోర్ కొట్టించారు. నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేని సినిమా నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గించకుండా చూసుకున్నారు. మణిశర్మ బ్యాగ్రౌండ్ మ్యూజిక్స్ తో ఆకట్టుకున్నారు. లంక గ్రామాన్ని చూపించడంలో సాయి ప్రకాశ్ ఉమ్మడి సింగు సక్సెస్ అయ్యారు.
ముగింపు:
ప్రజల భయాలను ఆసరాగా చేసుకున్న కొందరు దొంగ బాబాలు ఎలాంటి ఆగడాలు సృష్టిస్తారు? గ్రామ ప్రజల్లో ఎలాంటి భయాలు మొదలవుతాయని నేచురల్ ఉంది సినిమా.
రేటింగ్: 2.5/5