India strikes Pakistan : ఆరోపణలకు తగ్గట్టుగానే మనం గనక కిరానా హిల్స్ పై దాడి కనుక చేసి ఉంటే ఉగ్రవాద దేశం పరిస్థితి మరో విధంగా ఉండేది.. ” కిరానా హిల్స్ పై మేం దాడులు చేయలేదు. అది మా హిట్ లిస్ట్ లో లేదు. మా టార్గెట్ కేవలం టెర్రరిస్టులు మాత్రమే. టెర్రరిస్టుల క్యాంపులు మాత్రమేనని” ఎయిర్ మార్షల్ భారతి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ” కిరానా హిల్స్ లో భూగర్భ సొరంగాలు ఉన్న విషయం మాకు తెలియదు. అందులో న్యూక్లియర్ వార్ హెడ్స్ ను స్టోర్ చేశారు అనే విషయం కూడా మాకు తెలియదు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ అదే విషయాన్ని ఒప్పుకుంది. దీనికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని” భారతి పేర్కొన్నారు.. అయితే ఇక్కడే ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అది ఇండియాను మాత్రమే కాదు, ప్రపంచాన్ని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.
Also Read : బలూచిస్తాన్.. ఇక స్వతంత్ర దేశం..
కొన్ని సంవత్సరాల క్రితం జపాన్లో ఫుకు షిమా అణు రియాక్టర్లు రేడియేషన్ వెలువడింది. నాడు ఆ రేడియేషన్ తీవ్రతను గుర్తించడానికి..అది గాలిలో ఏ స్థాయిలో వ్యాపించి ఉందో తెలుసుకోవడానికి మాపింగ్ టూల్స్ ఉపయోగించారు. మాపింగ్ టూల్స్ ను బీచ్ క్రాఫ్ట్ -350 అనే విమానంలో భద్రపరిచి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేశారు. ఇవి మనం అమెరికా దేశానికి చెందినది.. ఇలాంటి విమానాల రాకపోకలను ఫైట్ రాడార్ -24 అనే సంస్థ రికార్డు చేస్తూ ఉంటుంది. బీ -350 విమానంలో ఏరియల్ మేజరింగ్ సిస్టం ఉంటుంది. ఇందులో ఉండే గామా కిరణాలు సెన్సార్స్ తో పనిచేస్తాయి. విమానం గాల్లో ఎగురుతూనే.. భూమిలో ఎంత రేడియో ధార్మికత లెక్క వేస్తుంది.. అయితే నాడు అమెరికా ఈ విమానాన్ని పాకిస్తాన్ దేశానికి ఇచ్చింది. అభిమానం ఈజిప్ట్ ద్వారా వచ్చింది. అయితే ఆ అభిమానంలో బోరాన్ అనే రసాయనం ఉంది. దానిని పాకిస్థాన్లో దిగుమతి చేసి విమానం వెళ్ళిపోయింది. బోరాన్ ను అణు వ్యర్ధాలను శుద్ధి చేయడానికి.. జాగ్రత్తగా ఉంచడానికి ఉపయోగిస్తారు. వాస్తవానికి పాకిస్తాన్ చెప్పినట్టుగా ఇప్పుడు కిరానాహిల్స్ ప్రాంతంలో న్యూక్లియర్ హెడ్స్ నుంచి లీక్ అయిన విషయం వాస్తవమే. అందుకే బీ -350 విమానం ద్వారా రేడియేషన్ తీవ్రతను గుర్తించారు. తర్వాత బోరాన్ రసాయనం ద్వారా దాని లీకేజీని ఆపారు. అయితే లీకేజీ ఆగాలి అంటే బోరాన్ మాత్రమే కాదు.. భారత్ దాడులు కూడా ఆపాలి. భారత్ దాడులు ఆపాలి అంటే ముందుగా నరేంద్ర మోడీకి ఫోన్ చేయాలి. ఆ ప్రయత్నాన్ని అమెరికా చేసింది. ముందుగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు. ఆయనను ఫోన్లో అభ్యర్థించిన తర్వాతే ట్రంప్ లైన్ లోకి వచ్చాడు. ఆ తర్వాతే కాల్పుల విరమణకు నరేంద్ర మోడీ ఒప్పుకున్నాడు..
మోడీ జాలి మాత్రమే చూపించాడు
వాస్తవానికి మోడీ ఇంకాస్త దూకుడు కొనసాగిస్తే పాకిస్తాన్ ఎప్పుడో నాశనం అయ్యేది. మోడీ దయ చూపడం వల్ల పాకిస్తాన్ బతికి బట్ట కట్టింది. అయినప్పటికీ ఆపరేషన్స్ సిందూర్ ఆగదని నరేంద్ర మోడీ స్పష్టం చేశాడు. స్థూలంగా ఒక మాటలో చెప్పాలంటే ఆపరేషన్ సిందూర్ ఇంటర్వెల్ వరకు మాత్రమే వచ్చింది. అసలు క్లైమాక్స్ ఇంకా మిగిలే ఉంది. ఇక 1971లో బంగ్లాదేశ్ విముక్తి సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలు అందరికీ తెలిసినవే. నాడు భారత్ పైకి దాడులు చేయడానికి బ్రిటన్, అమెరికా నౌకలు పంపింది. ఆ సమయంలో ఇందిరా గాంధీ మాట్లాడటంతో ఉమ్మడి రష్యా నుంచి న్యూక్లియర్ జలాంతర్గామి మనకు అనుకూలంగా జలాల్లోకి దిగింది. దీంతో బ్రిటన్, అమెరికా వెనక్కి వెళ్లిపోయాయి. చివరికి మన ఆర్మీ దూకుడుకు తట్టుకోలేక ఉగ్రవాద దేశానికి చెందిన సైనికులు చిక్కారు. వారికి భోజనం పెట్టాలంటే నాడు ప్రతిరోజు 10 లక్షల దాకా ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంది. అంత డబ్బులు కేవలం సంతకాలు మాత్రమే పెట్టించుకుని.. ఆ ఖైదీలను ఇందిరా గాంధీ వదిలేసింది. అయితే ఇక్కడ పాకిస్తాన్ పౌరులు మోడీ టార్గెట్ కాదు. మోడీ లక్ష్యం ఉగ్రవాదులు.. ఉగ్రవాదుల స్థావరాలు మాత్రమే. అన్నట్టు ఆపరేషన్ సిందూర్ కొనసాగుతూనే ఉంటుంది. చివరికి మోడీ అడ్డు చెప్పినా కూడా అది ఆగే పరిస్థితి లేదు.