spot_img
Homeజాతీయ వార్తలుIndia Pakistan Border Tensions: భారత్ తో యుద్దానికి పాకిస్థాన్ రె‘ఢీ’.. ఆపరేషన్ సిందూర్ డోస్...

India Pakistan Border Tensions: భారత్ తో యుద్దానికి పాకిస్థాన్ రె‘ఢీ’.. ఆపరేషన్ సిందూర్ డోస్ సరిపోలేదనుకుంటా..

India Pakistan Border Tensions: గత ఏడాది సరిగ్గా ఇదే సమయానికి పాకిస్థాన్ నెత్తినోరూ మొత్తుకుంది. బ్బాబ్బాబూ మమ్మల్ని వదిలేయండి మీకు దండం పెడతాం అంటూ కాళ్లు పట్టుకుంది. చచ్చిన పామును ఏం చంపుతామని భారత్ బతుకుపో అంటూ వదిలిపెట్టింది. లేకుంటేనా పాకిస్థాన్ ప్రపంచ పటంలో ఉండేదే కాదు.

భారత్ దయాదాక్షిణ్యాల మీద బతికిన పాకిస్థాన్ మళ్లీ పిచ్చి లేసిన కుక్క లాగా అరవడం మొదలుపెట్టింది. సరిహద్దుల్లో మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. నిబంధనలు అతిక్రమించి జమ్మూలో భారత సైన్యం ఏర్పాటు చేసుకున్న చెక్ పోస్టుల ప్రాంతాలలో పాకిస్థాన్ సైన్యం ఈనెల 9న తెల్లవారుజామున డ్రోన్లను పంపించింది.

ఆ డ్రోన్లను కూల్చివేయడానికి భారత సైన్యం 15 రౌండ్ల పాటు కాల్పులు జరపాల్సి వచ్చింది. అయితే ఆ డ్రోన్లు మళ్లీ పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లిపోయాయి. ప్రతిసారీ నిబంధనలు అతిక్రమించడం పాకిస్థాన్ కు అలవాటే. కాకపోతే పహల్గాం ఘటన తర్వాత భారత్ కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేస్తోంది. సరిహద్దుల్లో చీమచిటుక్కుమన్నా తెలిసేలా సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. అందువల్లే పాకిస్థాన్ డ్రోన్లపై భారత్ కాల్పులు జరిపింది.

ఇలాంటి పనులు పాకిస్థాన్ ఎందుకు చేస్తోందంటే..ప్రస్తుతం పాకిస్థాన్ లో అంతర్గత సంక్షోభాలు ఏర్పడ్డాయి. భారత్ జీలం, చినాబ్ నది ప్రవాహాలకు అడ్డుకట్ట వేసింది. దీంతో పాకిస్థాన్ లో వ్యవసాయం సాగే పరిస్థితి లేదు. పీవోకే లో పాకిస్థాన్ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. బలూచిస్థాన్ ఆర్మీ పాకిస్థాన్ కు చుక్కలుచూపిస్తోంది. ఆర్థిక సంక్షోభం కూడా పాకిస్థాన్ పాలకులను కలవరపాటుకు గురి చేస్తోంది.

ఇవన్నీతగ్గిపోవాలంటే ఏదోఒకటి చేయాలి. భారత్ మీద దాడులు చేసినట్టు కలరింగ్ ఇస్తే అంతర్గత సంక్షోభాలను డైవర్ట్ చేయవచ్చని పాకిస్థాన్ భావిస్తోంది. అయితే ఆపరేషన్ సిందూరు జస్ట్ శాంపిల్ మాత్రమేనని..ఈసారి పాకిస్థాన్ కయ్యానికి కాలు దువ్వితే.. లేపడానికి కాలు..దువ్వాడానికి చేయి ఉండవని భారతసైన్యం స్పష్టం చేస్తోంది. అంటే ఈలెక్కన పాకిస్థాన్ దేశాన్నిప్రపంచ పటం నుంచి తీసివేయడానికి భారత్ గట్టిగా ఫిక్స్ అయిందన్నమాట.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper
Exit mobile version