India Pakistan Ceasefire : జమ్మూకశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతం పహల్గాంలో ఉగ్రవాదులు ఏప్రిల్ 22న జరిపిన కాల్పుల్లో 26 మంది మరణించారు. ఈ దాడి చేసింది జైష్–ఎ–మహ్మద్‌కు చెందిన ది రెసిస్టెన్స్ ఫోర్స్(టీఆర్‌ఎఫ్) అని ఎన్‌ఐఏ గుర్తించింది. దీంతో మే 7న భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలపై దాడులు చేసి ధ్వంసం చేసింది. దీంతో పాకిస్తాన్ కూడా యుద్ధానికి దిగింది. ఈ వార్‌లో భారత్ స్పష్టంగా పైచేయి సాధించింది. అయితే గెలుపు దిశగా పయనిస్తున్న సమయంలో యుద్ధం అర్ధంతరంగా ఆపేశారు. సీజ్‌ఫైర్ ప్రకటించారు. ఈ క్రెడిట్ తన ఖాతాలో వేసుకునేందుకు అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అణుయుద్ధాన్ని ఆపినట్లు ప్రకటించుకుంటున్నా. ఇది భారత్‌లోని విపక్షాలకు ఆయుధంగా మారింది. యుద్ధం ఆగడానికి రెండు దేశాల మధ్య జరిగిన చర్చలే కారణమని కేంద్రం, ఆర్మీ ఇదివరకే ప్రకటించాయి. కానీ, మన విపక్షాలు మన ఆర్మీ మాటల కన్నా.. ట్రంప్ మాటలకే విలువ ఇస్తున్నాయి. వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో దీనిపై కేంద్రాన్ని నిలదీస్తున్నారు. మోదీ నోరు విప్పాలని పట్టుపడుతున్నాయి.
రాహుల్ కీలక వ్యాఖ్యలు..
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ.. పార్లమెంటు ఆవరణలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్–పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వాదనలపై ‘ప్రధానమంత్రి ఎలా ప్రకటన ఇవ్వగలరు? కాల్పుల విరమణ ట్రంప్ చేశారని ఆయన చెబుతారా? లేదు, ఆయన అలా అనరు. ట్రంప్ కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించారనేది వాస్తవం… ఇది కాల్పుల విరమణ గురించి మాత్రమే కాదు, రక్షణ పరిశ్రమ, ఆపరేషన్ సిందూర్‌పై చర్చలు జరపాలనుకుంటున్నాము… ప్రధానమంత్రి ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేకపోతున్నారు. డొనాల్డ్ ట్రంప్ తాను కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించానని 25 సార్లు చెప్పారు. అలా చేయడానికి ట్రంప్ ఎవరు? ఇది అతని పని కాదు, కానీ ప్రధానమంత్రి ఒక్కసారి కూడా స్పందించలేదు… ఇది నిజం, మీరు దాని నుంచి పారిపోలేరు…’ అని మోదీని ఉద్దేశించి అన్నారు.
రాహుల్ వాదన..
ట్రంప్ వాదనలు భారతదేశ రాజకీయ నాయకత్వాన్ని బలహీనంగా చిత్రీకరిస్తాయని, ప్రధానమంత్రి దీనిని ఖండించడంలో విఫలమయ్యారని రాహుల్ పేర్కొన్నారు. రక్షణ పరిశ్రమ, ఆపరేషన్ సిందూర్ వంటి అంశాలపైనా పార్లమెంటులో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ యొక్క విమర్శలు ప్రతిపక్షానికి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకునే అవకాశాన్ని ఇచ్చాయి,
మోదీ మౌనం ఎందుకు..
ట్రంప్ వ్యాఖ్యలు, విపక్షాల విమర్శలపై ప్రధానమంత్రి మోదీ స్పందించకపోవడం ఇప్పుడు విమర్శలకు కారణమవుతోంది. చర్చనీయాంశమైంది. ట్రంప్ వ్యాఖ్యలు నమ్మడానికి ఆధారం లేదు. కానీ, ట్రంప్ పదే పదే క్రెడిట్ కోసం ప్రయత్నించడం అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు మోదీ–ట్రంప్ మంచి మిత్రులు.. నోబెల్ బహుమతి కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మౌనం వహిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవు™నన్నాయి. ఏది ఏమైనా మోదీ నోరు విప్పాలనిన అవసరం ఉంది.
#WATCH | Delhi: On US President Trump’s claims of brokering a ceasefire between India and Pakistan, Lok Sabha LoP and Congress MP Rahul Gandhi says, “How can Prime Minister give a statement? Will he say that the ceasefire was done by Trump? No, he won’t say that. This is the… pic.twitter.com/T73KKCQFxT
— ANI (@ANI) July 23, 2025