India Economy: భారత్ దశాబ్దకాలంగా ఆర్థికంగా వేగంగా ఎదుగుతోంది. తయారీ రంగం పుంజుకుంటోంది. ఎగుమతులు పెరుగుతున్నాయి. దీంతో మన ఆర్థికాభివృద్ధి కూడా పరుగులు పెడుతోంది. ఇప్పటికే గడిచిన పదేళ్లలో భారత్ 5వ అతిపెద్ద ఎకానమీగా ఎదిగింది. రాబోయే నాలుగేళ్లలో అంటే 2030 నాటికి భారత్ 7.3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీతో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎకానమీగా ఎదుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వేగవంతమైన పురోగతి అమెరికా, చైనా వంటి దేశాల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. భారత్ జీడీపీ పెరుగుదల రేటు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండటం ఈ మార్పుకు కారణం.
డెడ్ ఎకానమీ అన్న ట్రంప్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఆర్థిక వ్యవస్థను ‘స్థిరంగా లేని’ డెడ్ ఎకానమీ అని విమర్శించారు. ట్రంప్ వ్యాఖ్యలకు మన దేశంలోని విపక్ష నేతలు వంత పాడారు. అయిత ఎవరేమన్నా.. దేశ ఆర్థిక పురోగతి మాత్రం ఆగడం లేదు. వేగంగా దూసుకుపోతోంది.
ఓర్వలేకనే టారిఫ్‌లు..
భారత ఆర్థిక బలోపేతాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో అమెరికా అధిక టారిఫ్‌లు విధించింది. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో పెరిగిన ఉద్రిక్తతలకు సూచిక. చైనా కూడా అంతర్గత సమస్యలు, సరిహద్దు విషయాల్లో భారత్‌ను రెచ్చగొడుతోంది. పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లను ఉత్తేజపరచడం ఈ వ్యూహంలో భాగమే.
డిఫెన్స్, ఆర్థిక రంగాల్లో వేగంగా..
భారత ప్రభుత్వం రక్షణ, ఆర్థిక రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెంచుతోంది. స్వయం సమృద్ధి, ఆధునికీకరణ కార్యక్రమాలు దేశ ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలు ప్రపంచ శక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. భారత్ పొరుగు దేశాల్లో ప్రభావం పెంచుకునేందుకు కృషి చేస్తున్నారు.
అమెరికా, చైనా భారత ఆర్థిక ఆవిష్కరణలను సహించలేకపోతున్నాయి. పొరుగు దేశాలపై పన్నులు, రాజకీయ ఒత్తిడి ద్వారా భారత్‌ను అడ్డుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ భారత్ అడుగులు ఆపకుండా ముందుకు సాగుతోంది. 2030 నాటి మూడో స్థానం ఈ పోరాటంలో విజయానికి చిహ్నం.