Spirit Update: సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో ప్రభాస్ హీరోగా వస్తున్న స్పిరిట్ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఒక షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసిన సందీప్ రెడ్డివంగ ఈ షెడ్యూల్ నుంచే ప్రభాస్ యొక్క మొదటి లుక్కును అలాగే గ్లింప్స్ ను సైతం రిలీజ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దాంతో పాటుగా జనవరి ఒకటోవ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ని ఇవ్వడానికి సందీప్ రెడీ అవుతున్నాడు. ప్రభాస్ షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ బాడీతో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నాడు. ఇంక సోషల్ మీడియాలో ఈ న్యూస్ ప్రస్తుతం వైరల్ గా మారింది. సందీప్ మాత్రం ఎలాంటి క్లూ ఇవ్వకుండా ప్రభాస్ అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఇప్పటివరకు ఎక్కడ కూడా ఈ విషయానికి సంబంధించి ప్రస్తావన తీసుకురావడం లేదు…
మొత్తానికైతే ప్రభాస్ ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాను చాలా ప్రస్టేజియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది…ఆయన ఈ సినిమాతో ఎలాంటి ఐడెంటిటి సంపాదించుకుంటాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సందీప్ చేసిన సినిమాలన్నీ అతనికి గొప్ప విజయాలను అందించి పెట్టాయి. మరోసారి తన ఖాతాలో భారీ సక్సెస్ ని అందుకోవాలనే లక్ష్యంతో అతను ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇప్పటివరకు ప్రభాస్ తన కెరియర్ లో చేయనటువంటి డిఫరెంట్ పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నారట. ఇక అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాల్లో హీరో చాలా కనిపించాడు.
ఇక ఈ సినిమాలో కూడా ప్రభాస్ క్యారెక్టర్ అలాగే ఉంటుందా అంటూ కొంతమంది ప్రేక్షకులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి దీనికి సందీప్ క్లారిటీ ఇస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉండడం విశేషం…సందీప్ మాత్రం జనవరి ఒకటోవ తేదీన భారీ అప్డేట్ ని ఇచ్చి ప్రేక్షకుల్లో జోష్ నింపాలనే ప్రయత్నం చేస్తున్నాడు…