https://oktelugu.com/

`జీరో’ శాతంకు భారత్ వృద్ధి రేట్!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత్ వృద్ధి రెట్ ఆశలను వమ్ము చేసి, `జీరో’ స్థాయికి తీసుకు వేళ్ళనున్నదా? అవునన్న సంకేతాలు వెలువడుతున్నాయి. లాక్‌డౌన్‌ పొడిగింపుతో భారత ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ.18 లక్షల కోట్ల నష్టం వాటిల్లవచ్చని బ్రిటన్‌కు చెందిన బ్రోకరేజీ సంస్థ బార్క్‌లేస్‌ అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది అసలు వృద్ధికి తావులేదన్నది. సున్నాగా తేల్చేసింది. ఆర్థిక సంవత్సరం ఆధారంగా చూస్తే మాత్రం జీడీపీ 0.8 శాతంగా నమోదు కావచ్చని చెప్పింది. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 15, 2020 / 10:29 AM IST
    Follow us on


    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ భారత్ వృద్ధి రెట్ ఆశలను వమ్ము చేసి, `జీరో’ స్థాయికి తీసుకు వేళ్ళనున్నదా? అవునన్న సంకేతాలు వెలువడుతున్నాయి. లాక్‌డౌన్‌ పొడిగింపుతో భారత ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ.18 లక్షల కోట్ల నష్టం వాటిల్లవచ్చని బ్రిటన్‌కు చెందిన బ్రోకరేజీ సంస్థ బార్క్‌లేస్‌ అంచనా వేసింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది అసలు వృద్ధికి తావులేదన్నది. సున్నాగా తేల్చేసింది.

    ఆర్థిక సంవత్సరం ఆధారంగా చూస్తే మాత్రం జీడీపీ 0.8 శాతంగా నమోదు కావచ్చని చెప్పింది. కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా వచ్చే నెల 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు మంగళవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దీంతో ఇప్పటిదాకా ఉన్న నష్ట అంచనాలు రెట్టింపైయ్యాయి.

    మొదటి 21 రోజుల లాక్‌డౌన్‌లో సుమారు రూ.10 లక్షల కోట్ల నష్టం రావచ్చన్న బార్క్‌లేస్‌.. పొడిగింపుతో దాదాపు రూ.18 లక్షల కోట్లుగా ఉండవచ్చని చెప్తున్నది.

    ఇక ఈ ఏడాది వృద్ధిరేటు ఉండదన్న బ్రోకరేజీ.. 2020-21 ఆర్థిక సంవత్సరానికి 0.8 శాతంగా అంచనా వేసింది. తయారీ, వ్యవసాయ, గనుల రంగాలు అధికంగా ప్రభావితం అవుతున్నాయని వివరించింది.

    మరోవైపు ఈ ఏడాది దేశ జీడీపీ 1.9 శాతంగా నమోదు కావచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అంచనా వేసింది. 1930 తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ లేనంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నదని మంగళవారం తమ తాజా నివేదికలో అభిప్రాయపడింది. ఈ సంవత్సరం జీడీపీ-3 శాతానికి పతనం కావచ్చన్నది.
    భారత వృద్ధిరేటుపైనా అధిక ప్రభావం ఉంటున్నదని వెల్లడించింది. 1991 తర్వాత అత్యంత కనిష్ఠ వృద్ధిరేటును భారత్‌ నమోదు చేయవచ్చని భావిస్తున్నట్లు తెలిపింది. అయితే వచ్చే ఏడాది దేశ ఆర్థిక వృద్ధిరేటు 7.4 శాతానికి పెరుగవచ్చనడం గమనార్హం.