Homeక్రీడలుక్రికెట్‌SRH vs MI Highlights: ఇలా కొడుతుంటే.. ఏ బుమ్రా మాత్రం ఏం చేయగలడు.. ఐపీఎల్...

SRH vs MI Highlights: ఇలా కొడుతుంటే.. ఏ బుమ్రా మాత్రం ఏం చేయగలడు.. ఐపీఎల్ అంటేనే బ్యాటింగ్ ప్యారడైజ్

SRH vs MI Highlights: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కనీసం వంద పరుగులు కూడా చేయకుండానే అక్షర్ పటేల్ సేన కుప్పకూలిపోయింది. ఐపీఎల్ లో ఇటువంటి సందర్భాన్ని అత్యంత అరుదుగా భావిస్తుంటారు. అది, ఇంకా కొన్ని మ్యాచ్లు మినహా.. మిగతా అన్ని మ్యాచ్లలో ఈసారి భారీగానే పరుగులు నమోదు అయ్యాయి. ఇప్పటికింకా లీగ్ దశ పూర్తి కాలేదు. అయినప్పటికీ ఈసారి రికార్డులు బద్దలవుతున్నాయి.. సరికొత్త ఘనతలు నమోదవుతున్నాయి.

బుధవారం ముంబైతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఏకంగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 244 పరుగుల టార్గెట్ ను జస్ట్ 18.4 ఓవర్లలో ఫినిష్ చేసింది. హెడ్ 76, క్లాసెన్ 65* పరుగులు చేశారు. అభిషేక్ శర్మ 45, నితీష్ కుమార్ రెడ్డి 21, సలీల్ అరోరా 30* పరుగులు చేశారు.. ఈ సీజన్ లో హైదరాబాద్ జట్టుకు ఇది వరుసగా 5వ విజయం.. మొత్తంగా ఆరవ విజయం. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ ఆశలు మొత్తం దాదాపుగా సన్నగిల్లిపోయాయి. ఇకపై ముంబై జట్టు ప్లే ఆఫ్ వెళ్ళాలంటే ప్రతి మ్యాచ్లో కూడా గెలవాల్సిన అవసరం ఉంది.

ఈసారి ఐపీఎల్లో సరికొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా బౌలర్లు చేతులెత్తేస్తున్నారు. ప్లాట్ మైదానాల మీద బ్యాటర్లు అదరగొడుతున్నారు. సెంచరీల మోత మోగిస్తున్నారు. ఫలితంగా ఐపీఎల్ ఈసారి కూడా బ్యాటర్ల పారడైజ్ గా మారిపోయింది. ముఖ్యంగా 200 పరుగులకు మించిన టార్గెట్ ను ఈసారి జట్లు అత్యధిక సార్లు (10) ఫినిష్ చేశాయి. ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 244 హైదరాబాద్ ఫినిష్ చేయడంతో ఈ రికార్డు సాధ్యమైంది. 2025లో 9సార్లు.. 2023లో 8 సార్లు, 2024లో ఆరుసార్లు రెండు వందలకు పైగా పరుగుల లక్ష్యాన్ని జట్లు ఫినిష్ చేశాయి. అయితే ఈసారి సొంత గడ్డ మీద ముంబై ఇండియన్స్ వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది తొలిసారి.

ప్లాట్ మైదానాలు రూపొందించడంతో ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ముఖ్యంగా యంగ్ ప్లేయర్లు సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నారు.. సీనియర్ ప్లేయర్లు కూడా దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నారు. అందువల్లే జట్లు భారీగా పరుగులు చేస్తున్నాయి. కొన్ని సందర్భాలలో భారీగా పరుగులు నమోదు కాకపోయినప్పటికీ.. ఆ లోటును మిగతా మ్యాచులు భర్తీ చేస్తున్నాయి. ఐపీఎల్ అంటేనే పరుగుల వరద. ఈసారి అది ఇంకాస్త ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో బుమ్రా కాదు, అంతకుమించిన బౌలర్లు బౌలింగ్ వేసినా సరే పెద్దగా ఉపయోగం ఉండదు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version