చైనా దేశం జిత్తులమారి అని ప్రపంచానికి ఎప్పుడో తెలుసు. పెదాలపై నవ్వుతో నోసలతో వెక్కిరిస్తూ చైనా భారత్ ను కవ్విస్తోంది. సరిహద్దుల్లో భారత జవాన్లను దొంగదెబ్బ తీసింది చాలక.. ఆ నెపాన్ని భారత్ పైనే రుద్దాలని చూసింది. చైనా నమ్మదగిన దేశం కాదని ప్రపంచానికి తెలుసు కాబట్టే చైనా మాటలకు పెద్దగా స్పందన లభించలేదు. భారత ఆర్మీ చైనాను సరిహద్దుల్లో సమర్ధవంతంగా తిప్పికొట్టడంపై ప్రపంచదేశాలు సైతం మనకే మద్దతు పలుకుతున్నాయి. రక్షణరంగంలో అద్వితీయ శక్తిగా భావిస్తున్న చైనాకు భారత్ సరిహద్దుల్లో గట్టిగానే బుద్దిచెబుతోంది.
కేసీఆర్ కు కరోనా మరక.. వదిలేలా లేదుగా?
భారతదేశం శాంతికాముక దేశమని ప్రపంచానికి చాటిచెబుతోంది. అయితే తనపై దాడిచేస్తే ఎంతమాత్రం ఊపేక్షించేది లేదని ప్రపంచానికి మరోసాటి చాటిచెప్పింది. సరిహద్దుల్లో 300వరకు ఉన్న చైనా సైన్యం వందమంది భారత జవాన్లపై దొంగదెబ్బ తీశారు. వీరిలో 21మంది భారత జవాన్లు వీరమరణం పొందగా 74మంది గాయాలపాలై తిరిగి కోలుకున్నారు. అయినప్పటికీ భారత జవాన్లు చైనా సైన్యాన్ని సరిహద్దుల నుంచి తరిమి ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో ఆ దేశానికి రుచిచూపించారు. భారత సైన్యం ఆత్మస్థైర్యం ముందు డ్రాగన్ తోకముడవక తప్పలేదు. భారత ఆర్మీని నేరుగా ఎదుర్కోక చైనా భారత మిత్రదేశాలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. బంగ్లాదేశ్, నేపాల్ దేశాలను తాయిలాలు ప్రకటిస్తూ భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడిస్తోంది. దీనిని పసిగట్టిన భారత్ మిత్రదేశాలను విషయంలో సంయమనం పాటిస్తోంది.
మరోవైపు పాకిస్థాన్ తో కలిసి చైనా సరిహద్దుల్లో కవ్విస్తోంది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో చైనాకు చెందిన యుద్ధవిమానాలను రంగంలోకి దింపింది. దీనిని భారత్ నిఘా వ్యవస్థ గుర్తించి సరిహద్దుల్లో అప్రత్తమైంది. ఈమేరకు భారత ఎయిర్స్ ఫోర్స్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. అంతేకాకుండా సరిహద్దుల్లో మిస్సైల్ విధ్వంస రాడర్ వ్యవస్థ(ఆకాష్)ను మోహరించింది. భారత సరిహద్దుల్లోకి చైనా యుద్ధవిమానాలు వస్తే వీటికి అక్కడక్కడే కూల్చేందుకు ఆకాశ్ సిస్టంను ఇప్పటికే గమ్యస్థానాలను భారత ఆర్మీ మోహరించింది. ప్రపంచంలో ఇప్పటివరకు శక్తివంతంగా పేరుగాంచిన రఫెల్ యుధ్ధ విమానాలను భారత్ అర్జెంట్ దేశానికి రప్పిస్తోంది. ఇవి అతి కీలకమైన టార్గెట్లను క్షణాల్లో పూర్తి చేయగలవు. వీటి ద్వారా చైనాకు, పాకిస్థాన్ ఒకేసారి బుద్ది చెప్పేందుకు భారత ఆర్మీ రెడీ అవుతోంది.
భారత్-చైనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు ఆవరించిన వెంటనే అమెరికా భారత్ కు మద్దతు ప్రకటించింది. ఇప్పటికే భారత్ కు రష్యా ఎప్పటి నుంచి మిత్రదేశంగా ఉంది. చైనాను వ్యతిరేకించే జపాన్ తదితర దేశాలు భారత్ కే మద్దతు ఇస్తున్నారు. అమెరికా బలగాలు ఇప్పటికే భారత్ కు చేరాయి. దీంతో అన్నివైపుల నుంచి భారత్ చైనాకు కళ్లెంవేస్తోంది. ఇప్పటికే కరోనా మహమ్మరి చైనా ప్రపంచం ముందు తలదించుకుంటోంది. ఇలాంటి తరుణంలో భారత్ తో యుద్ధంచేసి ప్రపంచం ముందు మరోసారి దోషిగా నిలుస్తుందా? అనేది చైనా నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఒకవేళ యుద్ధం వస్తే ఎక్కువగా నష్టపోయేది చైనానే అనే వాదనలు విన్పిస్తున్నాయి.
ఏపీలో దారుణం.. మహిళా ఉద్యోగిపై అధికారి దాడి…
సరిహద్దుల్లో ఉద్రిక్తల నేపథ్యంలో భారత్ చైనాను రక్షణ పరంగా, ఆర్థికంగా, దౌత్యపరంగా దెబ్బతీస్తూ ముందుకెళుతోంది. భారత్ ను కవ్విస్తే ఎంతదూరమైనా వెళుతామంటూ చైనాకు గట్టి వార్నింగ్ ఇస్తోంది. ఇప్పటికే చైనా అంతరంగాన్ని పసిగట్టిన ప్రధాని మోదీ చైనాతో మైండ్ గేమ్ ఆడుతోన్నారు. చైనాతో యుధ్ధానికి రెడీ అనే సంకేతాలు పంపుతున్నారు. ఒకవేళ చైనా భారత్ తో యుద్ధానికి దిగితే ఎక్కువ నష్టపోయే చైనానే అనే వాదనలు విన్పిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలనే చైనా కల భారత్ తో యుద్ధానికి దిగితే అది కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉండటంతో చైనాకు ఏం చేయాలో పాలుపోవడంలేదని తెలుస్తోంది. బయటికి చైనా మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్న భారత్ ఆర్మీతో పెట్టుకునే సాహనం చేయడం లేదు.
1962 యుద్ధానికి ముందున్న భారత సైన్యానికి ఇప్పుడున్న ఇండియన్ ఆర్మీకి చాలా తేడా ఉందని చైనాకు కూడా తెలుసు. రక్షణలో భారత్ ప్రపంచ దేశాలకు ఏమాత్రం తీసిపోవిధంగా తయారైంది. నిత్యం సరిహద్దుల్లో పాకిస్థాన్, ఉగ్రవాదులతో యుద్ధాలు చేస్తూ బలమైన శక్తిగా మారింది. ఇక చైనా ఎప్పుడు కూడా నేరుగా యుద్ధంలో పాల్గొన్న సందర్భాలు లేవు. దొంగదెబ్బతోనే యుద్దాల్లో గెలిచిన సంఘటన ఉన్నాయి. దీంతో యుద్ధం వస్తే భారత్ కే ఎక్కువ గెలుపు అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి చైనాకు గట్టిగానే బుద్ధి చెప్పేందుకు భారత ఆర్మీ రెడీ అంటోంది.