Independence Day 2024: దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం. రాష్ట్రలు, కేంద్రపాలిత ప్రాంతాలతోపాటు ఢిల్లీలో ఎర్రకోటపై జాతీయ పతాకాలు రెపరెపలాడుతున్నాయి. ఊరూరా.. వాడ వాడలా మువ్వన్నెల జెండాలు మురిసిపోతున్నాయి. 78వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేశారు. జాతీయ పతాకాన్ని ఎగురవేయడం వరుసగా ఇది 11వ సారి. 2014 ఆగస్టు 15వ తేదీ నుంచి ఇప్పటివరకు ఆయన వరుసగా రెడ్ ఫోర్ట్‌పై మువ్వన్నెలను రెపరెపలాడిస్తోన్నారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌కు వెళ్లి జాతిపిత మహాత్ముడికి నివాళులర్పించారు. స్వాతంత్రం కోసం పోరాడి అమరులైన వారికి అంజలి ఘటించారు. తర్వాత ఎర్రకోటకు చేరుకున్న వెంటనే త్రివిధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం త్రివర్ణ పతకాన్ని ఎగురువేశారు. ఆ సమయంలో హెలికాప్టర్లు ద్వారా పూల వర్షం కురిపించారు. అనంతరం జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా దేశాన్ని తీర్చిదిద్దుతామన్నారు. శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిందని పేర్కొన్నారు. దేశం కోసం ఎంతోమంది మహనీయులు ప్రాణాలు పణంగా పెట్టారని పేర్కొన్నారు. భారత దేశ ప్రస్తానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమన్నారు. తయారీ రంగంలో గ్లోబల్ హబ్‌గా చేయాలని సూచించారు. 2047 నాటికి వికసిత్ భారత్ మన అందరి లక్ష్యమని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ 2047 నినాదం 140 కోట్ల మంది భారతీయుల కలల తీర్మానం అన్నారు. ప్రపంచానికే అన్నంపెట్టే స్థాయికిభారత్ ఎదగాలని ఆకాంక్షించారు.
గతంలో నెహ్రూ..
ఇదిలా ఉంటే.. గతంలో దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రధాని హోదాలో ఎర్రకోట వేదికగా ఎక్కువసార్లు జాతీయ పతాకం ఎగురవేశారు. తాజాగా మోదీ నెహ్రూ రికార్డును సమయం చేశారు. ఆగస్టు 15వ తేదీ అంటే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేయడం జరుగుతుంది. నిజానికి జాతీయ జెండాను స్తంభం కింది నుంచి పైకి తాడుతో తీసుకెళ్లి అక్కడ ఎగురవేయడాన్ని జెండా ఎగురవేయడం అంటారు. 1947 ఆగస్టు 15న బ్రిటీష్ పాలన ముగిసిన వెంటనే బ్రిటిష్ వారి జెండాను అవనతం చేసి భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 15న ఎర్రకోటపై జెండాను ఎగురవేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 15న ఎర్రకోటపై దేశ ప్రధాని జెండాను ఎగురవేస్తున్నారు. 1950 జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జెండాను ఎగురవేశారు. అప్పటి నుండి భారత రాష్ట్రపతి ప్రతి సంవత్సరం జనవరి 26న విధి మార్గంలో జెండాను ఎగురవేస్తారు. అనంతరం భారీ కవాతు నిర్వహిస్తారు.