Independence Day 2023: వందల ఏళ్ల కొద్దీ పరాయిల పాలనలో ఉన్న భారతదేశం.. ఎందరో త్యాగధనుల స్ఫూర్తితో 1947లో స్వాతంత్ర్యం తెచ్చుకుంది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతీయుల జీవన స్థితి మారిపోయింది. మన దేశానికి 1947 ఆగస్టు 15న అర్ధరాత్రి స్వాతంత్ర్యం రావడంతో అప్పుడే సంబరాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా ఆగస్టు 15న జెండా ఎగురవేసి స్వాతంత్ర్య రోజులు గుర్తుకు తెచ్చుకుంటున్నాం. పాఠశాలలు, కార్యాలయాల్లో ఫ్లాగ్ డే నిర్వహించి ఉపన్యాసాల ద్వారా భారతదేశ గొప్పతనాన్ని చెబుతున్నారు. అయితే ఒకప్పుడు ఫేస్ టు ఫేస్ శుభాకాంక్షలు తెలపుకునేవారు. కానీ ఇప్పుడు ప్రతీ ఈవెంట్ ను సోషల్ మీడియా ద్వారా నిర్వహించుకుంటున్నారు. దీంతో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను ఈ క్రింది కోటేషన్స్ ద్వారా శుభాకాంక్షలు తెలుపవచ్చు.
– మన స్వేచ్ఛా, స్వాతంత్ర్యం కోసం ఎందరో అసువులు బాసిన సమరయోధుల గురించి తలుచుకుంటూ.. స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు..
-ఈ స్వాతంత్ర్యం పండుగ కన్నుల పండుగలా జరగాలని ఆకాంక్షస్తూ.. స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు..
-ప్రపంచంలోకెల్ల భారతదేశం మిన్నా.. అని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి? స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు..
-భరతమాత చేతిలో రెపరెపలాడే త్రివర్ణపతాకం.. సకల భారతావనికి ఆనంద సంబరం.. స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు..
-ఎందరో త్యాగధనుల పోరాటం.. నేటి మన స్వాతంత్ర్య సంబరం.. స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు..
-ప్రాణాలను త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలకు వందం.. అభివందనం.. స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు..
-సిరులు పొంగిన జీవగడ్డ.. పాలు పారిన భాగ్యసీమ.. భక్తితో కొలిచే భారతమాతకు..వందనం.. వందనం..
-హృదయాన్ని దేశభక్తితో నింపుకోవాల్సిన సమయం.. స్వాతంత్ర్య సంబరం..
-ఆంగ్లేయుల చెర నుంచి వీడిన భారతావనిని స్మరించుకుందాం..
-స్వేచ్చ, స్వాతంత్ర్యం అంటే ఇష్టమొచ్చినట్లు ఉండడం కాదు.. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి.. అప్పుడే సమరయోధులు సంతోషపడుతారు..