Janasena Chief Pawan Kalyan: అధికార వైసీపీపై జనాల్లో వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోంది. ఇక దాన్ని సరిగ్గా అందిపుచ్చుకోలేక టీడీపీ చతికిలపడుతోంది. చంద్రబాబు వయసు అయిపోవడం..తన మీడియా ద్వారా జగన్, వైసీపీపై దారుణమైన ట్రోలింగ్ విమర్శలు చేస్తుండడంతో టీడీపీని చూసి కూడా జనాలు ఈసడించుకునే పరిస్థితి. అదే పవన్ కళ్యాణ్ మాత్రం ఎంతో హుందాగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ విమర్శలకు సూటిగా.. సుత్తిలేకుండా.. చాలా హుందాగా కౌంటర్ ఇస్తున్నారు. ఇదే జనాల్లో పవన్ కళ్యాణ్ క్రేజును పెంచుతోంది.అదే సమయంలో వైసీపీ, టీడీపీల బూతు రాజకీయానికి వారి ప్రతిష్ట జనాల్లో దిగజారుతోంది.

పవన్ కళ్యాణ్ కు ఉన్న క్లీన్, నీట్ ఇమేజ్ ఆయనకు ప్రజల్లో మంచి గుర్తింపును తెచ్చిపెడుతోంది. పవన్ కళ్యాన్ ను వైసీపీ శ్రేణులు టార్గెట్ చేసి ఆయన వ్యక్తిగత జీవితాన్ని హననం చేస్తున్నా పవన్ నిబ్బరంగా ఎదుర్కొంటూ ప్రజల్లోనే వాటిని ఎండగడుతున్నారు. వైసీపీ నేతలను సునిశితంగా హెచ్చరిస్తున్నారు. ఎక్కడా హద్దులు దాటకుండా వైసీపీలా వారి ఆడకూతుళ్ల జోలి పోకుండా హుందాగా ప్రవర్తిస్తున్నాడు.
Also Read: JanaSena: పవన్ కళ్యాణ్ కి గ్రౌండ్ క్లియర్ చేస్తున్న జనసైనికులు
ఇక చంద్రబాబు టీడీపీ మాత్రం.. వైసీపీ నేతలను వారి వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తున్నారు. వైఎస్ జగన్ సతీమణిపై కూడా కొందరు టీడీపీ నేతలు కామెంట్స్ చేయడం.. పోస్టర్లు అంటించడం లాంటివి చేస్తున్నారు.రాజకీయాల్లోకి మహిళలను లాగుతున్న టీడీపీపై ప్రజల్లోనూ ఏహ్యాభావం వ్యక్తమవుతోంది.

అందుకే రాజకీయాల్లో ఎలా మెదలాలో పవన్ ను చూసి నేర్చుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఆయన ప్రజా కోణంలో తప్పితే.. వారికి సేవ చేయడంలో తప్పితే మరొకటి ఆలోచించరని అంటున్నారు. కౌలురైతులు సహా ప్రజల కు పంచేందుకు తను సినిమాల్లో కష్టపడి సంపాదించిన డబ్బును ఆర్థిక సాయం చేస్తున్న పవన్ తీరుకు ప్రజల్లో మంచి మార్కులు పడుతున్నాయి. పవన్ కి ఏపీలో మద్దతు పెరగడానికి ఆయన ఉదార వ్యవహారశైలియే కారణం. ప్రత్యర్థులతో పోలిస్తే అవినీతి రహిత, క్లీన్, నీట్, సేవాతత్పరతనే పవన్ కు ఏపీలో ప్రజల మద్దతు పెరగడానికి కారణంగా చెప్పొచ్చు.
Also Read: Janasena Early Elections: ముందస్తు ఎన్నికలు వస్తే జనసేన గెలిచే స్థానాలు ఎన్ని..?
[…] […]