Director Venu Sriram: దర్శకుడు వేణు శ్రీరామ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ‘వకీల్ సాబ్’ అంటూ తనని తాను దర్శకుడిగా బాగానే నిరూపించుకొన్నాడు. ‘పవన్ – త్రివిక్రమ్’ నీడలో కూడా తన ఉనికిని ఘనంగా చాటుకొన్నాడు వేణు శ్రీరామ్. ఓ సూపర్ హిట్ సినిమా రీమేక్ ని తెరకెక్కించడం ఒక ఎత్తయితే, ముఖ్యంగా పవర్ స్టార్ అభిమానుల అంచనాల్ని అందుకోవడం మరో ఎత్తు. ఈ విషయంలో వేణు శ్రీరామ్ కి పూర్తి మార్కులు పడ్డాయి. అయితే… ఆ హిట్ కి తగిన ప్రతిఫలం రాలేదు.

వేణు శ్రీరామ్ తదుపరి సినిమాపై ఇప్పటి వరకూ స్పష్టమైన ప్రకటన రాలేదు. అల్లు అర్జున్ తో అని చూచాయిగా ఫిక్స్ అయింది గానీ, స్క్రిప్ట్ ఫైనల్ అవ్వలేదు. బన్నీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. మరి, వేణు శ్రీరామ్ తో సినిమా ఉంటుందా ? ఊడుతుందా ? అనేదే ఇప్పుడు డౌట్. ఉందంటూ గతంలోనూ వార్తలొచ్చాయి. ఇప్పుడు అలాంటి వార్తలే వినిపిస్తున్నాయి. కానీ క్లారిటీ మాత్రం లేదు.
అయితే, వేణు శ్రీరామ్ మాత్రం అవేం పెద్దగా పట్టించుకోవట్లేదు.
Also Read: Indira Devi: ఇందిరాదేవి మహేష్ బాబు ఇంట్లో ఉండదా? ఎవరింట్లో ఉందేది?
ప్రస్తుతం రెండు కథలు రాసుకుంటున్నాడు వేణు శ్రీరామ్. బన్నీ కోసం ఒక కథ. మరో కథ ఓ మిడ్ రేంజ్ హీరో కోసం రాసుకుంటున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. బన్నీతో సినిమా ఉంటుంది. లేదు అనుకుంటే.. తాను రాసుకుంటున్న రెండో కథతో ముందుకు వెళ్లాలని వేణు ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఇంతకీ వేణు శ్రీరామ్ తన రెండో కథను ఏ హీరో కోసం రాసుకుంటున్నాడు ?, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… వేణు శ్రీరామ్, నితిన్ లేదా వరుణ్ తేజ్ లకు సెట్ అయ్యేలా తన రెండో కథను డిజైన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే వరుణ్ తేజ్ కి కథ కూడా చెప్పేశాడని, వరుణ్ తేజ్ కూడా ఓకే చేశాడని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే, వేణు శ్రీరామ్ – వరుణ్ తేజ్ కలయిక పై క్లారిటీ రావాలి అంటే.. వేణు శ్రీరామ్ – బన్నీ కాంబినేషన్ బెడిసి కొట్టాలి. ప్రస్తుతం బన్నీ పుష్ప 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక, వేణు శ్రీరామ్ దగ్గర కథ వింటాడు. కథ బాగుంటే సినిమా ఫిక్స్ అవుతుంది. బన్నీకి కథ నచ్చకపోతేనే.. వేణు శ్రీరామ్ – వరుణ్ తేజ్ సినిమా ఫిక్స్ అవుతుంది.
Also Read: Balakrishna- Mokshagna: ఒకే సినిమాలో బాలయ్య – మోక్షజ్ఞ… ఇదొక మైథలాజికల్ డ్రామా !
[…] […]