MP Raghurama Bandi sanjay: బండి సంజయ్, రఘురామ.. ఇద్దరినీ పోలీసులు కొట్టారు.. ట్రీట్ మెంట్ లో ఎంత తేడా?

MP Raghurama Bandi sanjay: ఒకరేమో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు.. మరొకరు ఏమో ఏపీ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.. ఇద్దరూ ఎంపీలే.. కానీ వారికి జరిగిన అన్యాయం విషయంలో ట్రీట్ మెంటే తేడాగా ఉంది. అవును కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో ఒకలా.. అదే ఏపీ ఎంపీ రఘురామ విషయంలో మరోలా కేంద్రం స్పందిస్తోంది. ఏపీ రాజకీయాలపై కేంద్రంలోని బీజేపీ ఉభయ కుశలోపరిగా వ్యవహరిస్తోంది. అటు వైసీపీని దూరం చేసుకోకుండా.. ఇటు చంద్రబాబును […]

Written By: NARESH, Updated On : January 22, 2022 9:29 pm
Follow us on

MP Raghurama Bandi sanjay: ఒకరేమో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు.. మరొకరు ఏమో ఏపీ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు.. ఇద్దరూ ఎంపీలే.. కానీ వారికి జరిగిన అన్యాయం విషయంలో ట్రీట్ మెంటే తేడాగా ఉంది. అవును కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో ఒకలా.. అదే ఏపీ ఎంపీ రఘురామ విషయంలో మరోలా కేంద్రం స్పందిస్తోంది.

ఏపీ రాజకీయాలపై కేంద్రంలోని బీజేపీ ఉభయ కుశలోపరిగా వ్యవహరిస్తోంది. అటు వైసీపీని దూరం చేసుకోకుండా.. ఇటు చంద్రబాబును కాలదన్నకుండా ఏపీలో చక్రం తిప్పేందుకు ఏదీ అనుకూలంగా వస్తే అటే అన్నట్టుగా కాచుకు కూర్చుంది. ఇక సొంతంగా జనసేనతో కలిసి ఎదిగేందుకు బీజేపీ యోచిస్తోంది.

ఈ క్రమంలోనే అటు ఏపీ సీఎం జగన్ తో బీజేపీ పెద్దలు సఖ్యతతో ఉంటున్నారు. అదే సమయంలో ఆయన ప్రత్యర్థులకు అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు. వైసీపీ రెబల్ ఎంపీ పై అనర్హత వేటు వేయాలని ప్రధాని మోడీ నుంచి హోంమంత్రి అమిత్ షా వరకూ జగన్ ఎన్నిసార్లు కలిసి కోరినా అది నెరవేరడం లేదు. అదే సమయంలో తన పరపతి ఉపయోగించుకొని ఎంపీ రఘురామ మోడీ, షా సహా కేంద్రమంత్రులను మచ్చి క చేసుకొని వేటు పడకుండా కాపు కాస్తున్నారు.

అందుకే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామను అరెస్ట్ చేసి కాళ్లు వాచిపోయేలా కొట్టినా కూడా కేంద్రం స్పందించలేదు. బీజేపీ పెద్దలు పట్టించుకోలేదు. ఒక ఎంపీని కొట్టడం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. లోక్ సభ స్పీకర్, ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసినా కూడా అక్కడి నుంచి స్పందన లేదు.

అయితే అదే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను కేవలం కాలర్ పట్టుకున్నందుకు లోక్ సభ స్పీకర్, ప్రివిలేజ్ కమిటీ సీరియస్ అయ్యింది. సీఎస్ సహా పోలీసు ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసి తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఇక కరీంనగర్ కమిషనర్ ను చత్తీస్ ఘడ్ , బీహార్ కు పనిష్ మెంట్ కేటాయించేందుకు రెడీ అయ్యిందట..

ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో ఒకలా.. తన విషయంలో మరోలా వ్యవహరిస్తోందని ఫాఫం రఘురామ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతైనా అధికార పార్టీ అది.. ఆ ట్రీట్ మెంట్ అలానే ఉంటుంది.. ఎటూ కాకుండా రెబల్ ఎంపీ రఘురామ.. ఈయనకు ఇలానే పట్టింపు లేకుండా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.