లాక్ డౌన్ పీరియడ్లో ఇవి పూర్తిగా బంద్.. వీటికి సడలింపులు

దేశంలో కరోనా కట్టడిని చేసేందుకు కేంద్రం మరోసారి లాక్డౌన్ పొడగించిన సంగతి తెల్సిందే. మే3వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అయితే ఈనెల 20తర్వాత కొన్నిరంగాలకు మినహాయింపులు ఉంటాయని ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెల్సిందే. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసింది. పూర్తిగా బంద్.. -హాట్ స్పాట్లలో అన్ని క్లోజ్ -రైలు, విమానాలు, రద్దు, మెట్రో సర్వీసులు -సినిమా థియేటర్లు బంద్, సిమ్మింగ్ పూల్స్, జిమ్ […]

Written By: Neelambaram, Updated On : April 15, 2020 12:41 pm
Follow us on


దేశంలో కరోనా కట్టడిని చేసేందుకు కేంద్రం మరోసారి లాక్డౌన్ పొడగించిన సంగతి తెల్సిందే. మే3వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అయితే ఈనెల 20తర్వాత కొన్నిరంగాలకు మినహాయింపులు ఉంటాయని ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెల్సిందే. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసింది.

పూర్తిగా బంద్..
-హాట్ స్పాట్లలో అన్ని క్లోజ్
-రైలు, విమానాలు, రద్దు, మెట్రో సర్వీసులు
-సినిమా థియేటర్లు బంద్, సిమ్మింగ్ పూల్స్, జిమ్ సెంటర్లు
-ఆటోలు, క్యాబ్ లు, రిక్షాలు బంద్
-బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదు
-విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు
-నిత్యావసర షాపులు మినహా అన్ని బంద్
-బార్లు, వైన్ షాపులు, పబ్బులు
-పార్కులు, సిమ్మింగ్ పూల్స్,
-అన్ని సభలు, సమావేశాలు నిషేధం
-మత ప్రార్థనలు, ఆలయాల్లో దర్శనాలు బంద్

షరతులతో కూడిన సడలింపులు..
-వ్యవసాయ పనులకు పూర్తి అనుమతి
-వ్యవసాయ మార్కెట్ల కొనుగోళ్లకు అనుమతి
-భవన నిర్మాణ పనులకు అనుమతి
-ఎక్కడ ఉండే వారితో అక్కడే పనులకు అనుమతి
-అన్నిరకాల సరుకు రవాణాకు అనుమతి
-ఉఫాధి హామీ పనులకు గ్రీన్ సిగ్నల్
-రొయ్యలు, చేపల రవాణాకు అనుమతి
-కొరియర్, ఈకామర్స్ సేవలకు అనుమతి
-కొన్నిరకాల సరుకు రవాణా సేవలకు అనుమతి
-రాష్ట్రాల మధ్య సరుకుల రవాణాకు అనుమతి
-గ్రామీణ ప్రాంతాల పరిశ్రమలకు అనుమతి
-ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, డీటీహెచ్ సేవలు యథాతధం
-ఎవరైనా చనిపోతే 20మందికి మించి హాజరు కాకుడదు.