Paatal Lok : ఈ భూమ్మీద పాపాలు చేస్తే పాతాళానికి వెళ్తామని, అక్కడ రాక్షసులు మనల్నీ పీక్కుని తింటారని చిన్నప్పుడు మన తాతయ్య, బామ్మలు చెబుతుండే వారు అది ప్రతి ఒక్కరికీ గుర్తుండే ఉంటుంది. అవును మనల్ని నిద్రపుచ్చడానికి చిన్నప్పుడు పాతాళానికి సంబంధించి కథలు చెబుతుండే వాళ్లు మన పెద్దవాళ్లు. అయితే అప్పుడు మనకు పెద్దగా తెలియకపోయినా.. రాను రాను అనిపిస్తూ ఉంటుంది. త్రిలోకాలు అంటే ఏంటి? అసలు పాతాళం ఎక్కడుంది? అక్కడ ఎవరెవరు ఉంటారు ? అని రకరకాల ప్రశ్నలు మదిలో మెదులుతుంటాయి. మన పురాణాల ప్రకారం మొత్తం మూడు లోకాలు ఉన్నాయి. అవే స్వర్గలోకం, భూలోకం, పాతాళ లోకం.
స్వర్గలోకం :దీన్నే స్వర్గమని కూడా అంటారు. ఇక్కడ దేవతలు ఉంటారని ప్రతీతి. భూమి పై పుణ్యాలు చేసిన వారు స్వర్గ లోకానికి వెళ్తుంటారని చెబుతుంటారు. స్వర్గలోకం ఆకాశంలో ఉంటుంది
భూలోకం : ప్రస్తుతం మనం నివసిస్తున్న భూమినే భూలోకం అంటారు. ఇక్కడ మానవులతో, జీవరాశులన్నీ ఇక్కడే నివాసం ఉంటున్నాయి.
పాతాళ లోకం : దీన్నే పాతాళం అని కూడా అంటారు. పాతాళ లోకం భూమి కింద ఉంటుందని ప్రతీతి. ఇక్కడ రాక్షసులు, యక్షులు, నాగజాతి వారుంటారని చెబుతుంటారు.
భూమి కింద ఉండే పాతాళ లోకం అత్యద్భుతంగా ఉంటుందట. చూస్తే ఇదే స్వర్గలోకమని, స్వర్గం కంటే అందంగా ఉంటుందని కొందరు అంటారు. ధనవంతులు, అందమైన ప్రకృతి దృశ్యాలతో ఆశ్చర్యపరుస్తుందట. అయితే వాస్తవానికి ఇదంతా మన భ్రమే. రాక్షసులు పాతాళాన్ని పరిపాలిస్తుంటారు. యక్షులు, నాగజాతికి చెందిన వారు ఇక్కడ ఉంటారు. ప్రముఖ ఖగోళ శాస్త్రం సూర్య సిద్ధాంతం ప్రకారం భూమి దక్షిణార్ధ గోళంలో పాతాళం, ఉత్తరార్ధ గోళాన్ని జంబూ ద్వీపం అని అంటారు.
విష్ణు పురాణంలో నారదుడు పాతాళాన్ని సందర్శించాడని పేర్కొన్నారు. ఎందుకంటే నారదుడు త్రిలోకాల్లో ఎక్కడికైనా సంచరించేందుకు పర్మీషన్ కలిగి ఉన్న వ్యక్తి. పాతాళం లోకం అంటే చనిపోయే వాతావరణాన్ని సృష్టించేదని ఆయన అక్కడ వర్ణించారు. పాతాళ లోకం భూమికి దిగువన ఉన్న గ్రహ వ్యవస్థల్లో ఉందని భాగవత పురాణంలో పేర్కొన్నారు. రాక్షసుల వాస్తు శిల్పి మాయ రాజభవనాలు, దేవాలయాలు, ధర్మశాలలు నిర్మించారని చెబుతున్నారు. పాతాళంలో సూర్య కాంతి ఉండదు. అంతా చీకటిగా ఉంటుంది.
అలాంటి పాతాళ లోకం ఈజిప్టులో కూడా ఉందట. దీనిని “నాగాల పాతాళ లోకం” అని అంటారు. ఇది ప్రాచీన ఈజిప్టు పురాణాలు, దేవతల కథలలో కనిపిస్తుంది. “నాగాల పాతాళ లోకం” అనేది ఒక ప్రతీకాత్మక, ఆధ్యాత్మిక స్థలం, ఇందులో సర్పాలు లేదా నాగాలు నివసిస్తాయనే విశ్వాసం ఉంది. ఈ విభాగం ఈజిప్టు పురాణాలలో భయం, మాయాజాలం, నరుడి ఆత్మల ప్రస్థానం అనుభూతులతో కూడుకుంది. పురాతన ఈజిప్టు మిథాలజీలో “పాతాళ” అంటే భూమి కింద ఉన్న లోకం, దీనిని సర్పాల లేదా నాగాల పరిపాలనగా చూపించారు. నాగాలు, పాతాళం ఈజిప్టు దైవాల కథలలో ప్రతీకాత్మకంగా ఉంటాయి.
ఈజిప్టు “ఆత్మల పుస్తకం” లేదా “డెడ్ బుక్” (Book of the Dead) లోని రచనలు, మరణం తర్వాత ఆత్మ ఎలా ప్రయాణిస్తుందో పాతాళ లోకంలో ఎలా కొనసాగుతుందో అన్న దానికి సంబంధించిన విశేషాలను వివరిస్తాయి. ఇక్కడ చిన్న బావిలా కనిపించినా లోపలికి పోతూ ఉంటే ఓ పెద్ద లోకమే ఉంది. బావిలో బావి, బావిలోపల బావి ఉంటూ అద్బుతుంగా ఉంటుంది. భారతదేశంలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలో మాదిరి లాజికులు ఈ లోకంలో ఉన్నాయి. అందులో అప్పటి కాలానికి సంబంధించిన చిత్రాలు నాటి చరిత్రకు అద్ధం పడుతున్నాయి.