Maoist Encounter : ఎన్ కౌంటర్ గురించి టాపిక్ వినిపిస్తే చాలు ప్రజల్లో హై అటెన్షన్ వస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ అటెన్షన్ ను పోగేసుకున్న ఎన్ కౌంటర్ ఏదంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది దిశ ఎన్ కౌంటర్. సీపీ సజ్జనార్ ఉన్న సమయంలో ఈ భారీ ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ తో ప్రజల్లో కాస్త భయం వచ్చినా అది కొన్ని రోజులే అని అర్థం అయింది. అత్యాచార కేసులు మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదనేది కాదనలేని వాస్తవం. అయితే ప్రస్తుతం మరో డిఫరెంట్ కోణానికి సంబంధించిన ఎన్ కౌంటర్ గురించి తెలుసుకుందాం.
మూవోయిస్టు ముక్త్ భారత్ సంకల్పంగా బస్తర్‌లో ఎన్‌కౌంటర్ల పర్వం సాగుతున్న విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్ దేశంలోనే రెండో పెద్ద ఎన్‌కౌంటర్ గా చెబుతున్నారు. అబూజ్‌మఢ్ అడవుల్లో దంతెవాడ, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో మావోయిస్టుల క్యాంప్‌పై DRG బలగాలు విరుచుకుపడ్డారు. ఈ భారీ ఎన్‌కౌంటర్ జరగడంతో 31మంది మావోయిస్టులు మరణించారు. గత 8 నెలల్లో 188 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. అయితే మావోయిస్టులకు గట్టి పట్టున్న దండకారణ్యంలో ఈ ఆపరేషన్ కగార్‌కు దారి చూపిందెవరు అనే ప్రశ్న చాలా మందిలో మెదులుతుంది.
మావోయిస్టు స్థావరాలను పోలీస్ బలగాలు ఎలా పసిగట్టాయనేది బిగ్ క్వశ్చన్. కూంబింగ్ ఆపరేషన్లు దండకారణ్యంలో మాములుగా జరుగుతుంటాయి. కానీ ఇప్పట్లా ఈ స్థాయి భారీ ఎన్‌కౌంటర్‌కు మాదిరి ఎప్పుడు జరగలేదు. మరి ఈ సారి జరిగిన ఎన్ కౌంటర్ కు ఎలా సాధ్యమైంది?.. పోలీసు బలగాలు కళ్లతో కాదు డేగ కాళ్లతో దండకారణ్యాన్ని ఎలా జల్లెడపట్టగలిగాయి? డేగ కాళ్లే ఆపరేషన్ కగార్‌కు నిఘా కళ్లయ్యాయా? అని ఆశ్చర్యపోతున్నారు ప్రజలు. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా జరిగిన ఇంత పెద్ద ఎన్‌కౌంటర్‌కు దారి చూపింది రాటుదేలిన గరుడ పక్షులా? అంటున్నారు కొందరు. అయితే కగార్ కా పీఛే ఈగల్ స్వ్కాడ్ సీక్రెట్ మిషన్ ఉంద అనే అనుమానాు కూడా వస్తున్నాయట.
పాత రోజుల్లో పావురాలతో రాయబేరం పంపేవాళ్లు అనే విషయం తెలిసిందే. ఆ కాన్సెప్ట్‌కు పోలీసులు మరింత పదను పెట్టి గరుడ టీమ్స్‌ను రంగంలోకి దింపారట. నెదర్లాండ్స్ సహా పలు దేశాల్లో మిలటరీ, నిఘా ఆపరేషన్స్‌లో ఈగల్ స్వ్కాడ్ ను వాడుతుంటారు. అసాంఘీశ శక్తుల కార్యకలాపాలను పసిగట్టడంలో ఈగల్ స్వ్కాడ్ ఎన్నో సత్ఫలితాలను ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి. డ్రోన్లతో గాలిస్తే యాంటి సోషల్ ఎలిమెంట్స్ అప్రమత్తమయ్యే చాన్స్ ఉంటుంది. అదే గరుడ కాళ్లకు హిడెన్ కెమెరాలను అమర్చి ఎగరేస్తే.. ఇక తిరుగు ఏం ఉంటుంది? విజిలేసినంత ఈజీగా దట్టమైన అడవిలో కూడా ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా సులభం అవుతుంది కదా. అలా ఆపరేషన్ కగార్‌కు ఇన్‌ఫార్మర్ నెట్‌వర్క్ కారణమనేది ఒక వాదన. కానీ ఈ ఈగల్ స్వ్కాడ్ ఎత్తుగడను కూడా ఉపయోగించారు అనే టాక్ కూడా ఉంది.
డేగ కాళ్లకు నిఘా నేత్రాలు.. దారి చూపేలా GPS
అయితే సైనిక స్థావరాలపైన ఎవరైనా డ్రోన్‌లు ఎగరేస్తే వాటిని పసిగట్టి ధ్వంసం చేసేలా తర్ఫీదునిచ్చి ఈగల్ స్వ్కాడ్‌ను రంగంలోకి దింపుతున్నారట. చాలా దేశాల్లో ఈగల్ స్వ్కాడ్‌ను బలోపేతం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తెలంగాణలో కూడా ఈగల్ స్వ్కాడ్‌ను ఏర్పాటు చేశారు అధికారులు. నిజామాబాద్, మొయినా బాద్‌లో శిక్షణ ఇచ్చారు కూడా. హోంశాఖ సూచనల మేరకు దండకారణ్యంలో చేపట్టిన ఆపరేషన్ కగార్‌లో తెలంగాణ ఈగల్ స్వ్కాడ్ సేవలను వినియోగించుకున్నారట. గరుడ పక్షి కాళ్లకు అమర్చిన హిడెన్ కెమెరాలు,జీపీఎస్ ట్రాకర్ సాయంతోనే పోలీస్ బలగాలు మావోయిస్టుల స్థావరాలను గుర్తించారని టాక్. మావోయిస్ట్ ముక్ భారత్ సంకల్పంగా కేంద్రం గ్రే హౌండ్స్ తరహాలో .సీఆర్పీఎఫ్ దళాల నుంచి మెరికల్లాంటి జవాన్లను ఎంపిక చేసి కోబ్రా బెటాలియన్లను రూపొందించారట. చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, బెంగాల్ మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో జల్లెడ పడుతోన్న కోబ్రా దళాలకు , తెలంగాణ ఈగల్ టీమ్ దిక్సూచిగా మారిందనే సమాచారం కూడా ఉంది.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: In dandakaranyam the question arises as to who led this operation to kagar
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com